Chandrabau Case: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో రెండ్రోజుల్నించి హోరాహోరీ వాదన జరుగుతోంది. నిన్నట్నించి కేసు వాదన అంతా సెక్షన్ 17ఏ చుట్టూనే తిరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ స్కిల్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు తన అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ముందు ఏసీబీ కోర్టు, తరువాత ఏపీ హైకోర్టు కొట్టివేశాయి. ఆ తరువాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో వారం రోజుల క్రితం వాదనలు జరిగాక కేసు నిన్న అంటే అక్టోబర్ 9కు వాయిదా పడింది. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నాట్ బిఫోర్ అంటూ తప్పుకోవడంతో కేసు జస్టిస్ త్రివేది, జస్టిస్ బోస్ బెంచ్ ముందుకు వచ్చింది. చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్ధ లూథ్రాలు వాదనలు విన్పిస్తుంటే, సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. 


నిన్నటి నుంచి సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై హోరాహోరీగా వాదనలు సాగాయి. ఇవాళ రెండవ రోజు కూడా వాదనలు గట్టిగానే జరిగాయి. వాస్తవానికి ఈ కేసులో చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు నిన్ననే ముగిసినా ఇవాళ మరో గంట గడువు కోరారు. కోర్టు అంగీకరించడంతో మరో గంట వాదనలు విన్పించారు. ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు అధికారి చర్యలు చేపట్టకూడదని చట్టం చెబుతోందని హరీష్ సాల్వే తెలిపారు. నిన్న కూడా సెక్షన్ 17ఏ సవరణ గురించే వాదించానని గుర్తు చేశారు


ఆ తరువాత సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. విచారణకే అర్హత లేని పిటీషన్‌పై ఎంతసేపు వాదనలు చేస్తారని ప్రశ్నించారు. ఈ పిటీషన్ ఆధారం లేనిదని, ఇప్పటికే కొట్టివేయాల్సిన కేసని ఇంకా ఎంతసేపు అవకామిస్తారని సీఐడీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ ప్రశ్నించారు. ఇప్పటివరకూ కోర్టు అనుసరిస్తున్న పద్దతిని అమలయ్యేలా చూడాలని, మొత్తం న్యాయశాస్త్రాన్నే తిరిగి రాస్తానంటే..మళ్లీ మేం మొదట్నించి రావాలని రోహత్గీ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(1) ప్రకారం ఓ వ్యక్తి నేరం చేశాడనే విషయం ఆలస్యంగా తెలిసినప్పుడు చట్టం ప్రకారం కేసు నమోదు చేయాల్సిందే.. అయితే దీనికి కొన్ని పరిమితులుంటాయోమో గానీ అడ్డంకులు మాత్రం ఉండవని ముకుల్ రోహత్గీ తెలిపారు. 


ఈ కేసుపై తదుపరి వాదనలు శుక్రవారానికి వాయిదా వేస్తామని సుప్రీంకోర్టు చెప్పినప్పుడు ఇవాళే ముగించాల్సిందిగా చంద్రబాబు న్యాయవాది లూధ్రా విజ్ఞప్తి చేశారు. అయితే ఇంకా చాలా కేసులున్నాయని అందుకే శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది బెంచ్ స్పష్టం చేసింది. శుక్రవారం మద్యాహ్నం 2 గంటలకు తిరిగి ఈ కేసులో విచారణ జరగనుంది. 


Also read: Chandrababu Case Updates: చంద్రబాబుకు మరో షాక్, బెయిల్ పిటీషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook