Chandrababu Eye Operation: ఎల్‌వి ప్రసాద్ ఐ ఆసుపత్రిలో చంద్రబాబుకు కంటి ఆపరేషన్ సక్సెస్
Chandrababu Eye Operation: ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయి మద్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటి ఆపరేషన్ పూర్తయింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఎల్‌వి ప్రసాద్ ఐ హాస్పటల్లో ఆపరేషన్ జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Eye Operation: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మొత్తానికి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. కంటి ఆపరేషన్ కారణంతోనే ఏపీ హైకోర్టులో మద్యంతర బెయిల్ పొందారు చంద్రబాబు. ఆరోగ్యా కారణాలతో కోర్టు ఆయనకు నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు కొట్టివేయగా, సుప్రీంకోర్టులో వాదనలు పూర్తయి నవంబర్ 8న రిజర్వ్ కాబడింది. మరోవైపు బెయిల్ పిటీషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించగా ఏపీ హైకోర్టు నవంబర్ 28కు వాయిదా వేసింది. ఈలోగా ఆరోగ్య కారణాలతో ముఖ్యంగా కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ పెండింగు ఉందని చెబుతూ మద్యంతర బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు కంటి ఆపరేషన్ నిమిత్తం నాలుగు వారాల బెయిల్ మంజూరు చేసింది. తిరిగి నవంబర్ 28న జైలులో లొంగిపోవల్సి ఉంది.
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అంతేకాకుండా చర్మ ఎలర్జీకు సంబంధించిన వైద్యం కూడా తీసుకున్నారు. నవంబర్ 2న ఏఐజీ ఆసుపత్రిలో చేరి ఒక రోజంతా అక్కడే ఉండి వివిధ పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత గ్యాస్ట్రో ఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల వైద్యులు పరీక్షలు చేశారు. బ్లడ్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, 2డీ ఈకో, అలర్జీ స్క్రీనింగ్, ఈసీజీ, లివర్, కిడ్నీ ఫంక్షనింగ్ పరీక్షలు పూర్తి చేశారు. ఎందుకంటే రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు ఆయనకు చర్మ ఎలర్జీ సంభవించింది.
చంద్రబాబుకు గతంలో ఎడమ కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ నిర్వహించారు. ఇప్పుడు కుడి కంటికి కూడా ఆపరేషన్ నిర్వహించాల్సి వచ్చింది. ఇవాళ హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్ కింటి ఆసుపత్రిలో కుడి కంటికి కేటరాక్ట్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
Also read: Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం నిలిపివేయాలంటూ ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook