Chandrababu Bail: ఎట్టకేలకు బెయిల్ పిటీషన్ దాఖలు చేసిన చంద్రబాబు, విచారణ ఎప్పుడంటే
Chandrababu Bail: ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ఇవాళ బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Bail: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రిమాండ్ పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు ఐదురోజుల తరువాత బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్ లిస్టింగ్ తేదీ ఇంకా ఖరారు కావల్సి ఉంది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే ఢిల్లీ సుప్రీంకోర్టు నుంచి ప్రముఖ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా అండ్ టీమ్ విజయవాడకు చేరుకుంది. చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు సెప్టెంబర్ 10న విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అయితే బెయిల్ కోసం పిటీషన్ వేయకుండా రిమాండ్‌కు వ్యతిరేకంగా వాదించారు. సెక్షన్ 409 అక్రమమంటూ వాదించారు. కోర్టు మాత్రం 409 సెక్షన్ సక్రమమేనని భావిస్తూ..చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తరువాత చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ కస్టడీ పిటీషన్‌పై సెప్టెంబర్ 11వ తేదీ అంతా వాదనలు విన్న ఏసీబీ కోర్టు 12వ తేదీ సాయంత్రానికి హౌస్ కస్టడీ పిటీషన్ కొట్టివేసింది. అదే రోజు ఏపీ హైకోర్టులో రిమాండ్ కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ 13వ తేదీకి లిస్టింగ్ అయింది. ఆ మరుసటి రోజున అంటే నిన్న ఏపీ హైకోర్టు క్వాష్ పిటీషన్‌పై విచారణ వాయిదా వేసింది.
అరెస్ట్ అయిన ఐదు రోజులకు ఇవాళ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ఇంకా లిస్టింగ్ కాకపోవడంతో విచారణ ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. సెప్టెంబర్ 19న క్వాష్ పిటీషన్ విచారణ, సెప్టెంబర్ 20న అంగళ్లు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటీషన్ విచారణ జరగనుంది. స్కిల్ కేసులో అరెస్ట్ వ్యవహారంలో ఇవాళ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ ఎప్పుడనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఘటనలో కూడా మరో పిటీషన్‌పై విచారణ సెప్టెంబర్ 20కు వాయిదా పడింది. అంటే సెప్టెంబర్ 19, 20 తేదీల్లో చంద్రబాబు క్వాష్ పిటీషన్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డ్ కేసు, అంగళ్లు ఘటనలో ముందస్తు బెయిల్ పిటీషన్ల విచారణలున్నాయి. అరెస్ట్ అయిన స్కిల్ కేసులో విచారణ ఎప్పుడనేది ఇంకా తెలియాలి.
Also read: Janasena-Tdp: ప్యాకేజ్ బంధం ప్రభావమే ఈ పొత్తు, జనసేన-టీడీపీ పొత్తుపై వైసీపీ విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook