Capital Amaravati Committee: ఐదేళ్ల అనంతరం ఏపీ రాజధాని అమ‌రావ‌తి అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో అమరావతి రాజ‌ధానిపై దృష్టి సారించింది. ఇప్పటికే రాజధాని అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి ఓ అంచనాకు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రాజధానిలో నిలిచిపోయిన పనులపై టెక్నికల్ క‌మిటీ ఏర్పాటు చేసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kilari Rosaiah: మాజీ సీఎం జగన్‌కు భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి ఎంపీ అభ్యర్థి రాజీనామా


గ‌తంలో నిలిచిపోయిన ప‌నుల‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాల‌నే దానిపై ఏర్పాటుచేసిన కమిటీ సిఫార్సులు చేయ‌నుంది. అమ‌రావ‌తి రాజధాని నగరంలో ఉన్న స‌మ‌స్య‌లను గుర్తించి సూచ‌న‌లు చేయాలని కమిటీకి ఏపీ ప్రభుత్వం సూచనలు చేసింది. ఈ క్రమంలోనే కమిటీని ఏర్పాటుచేస్తూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప‌బ్లిక్ హెల్త్ ఈఎన్‌సీ ఛైర్మ‌న్‌ నేతృత్వంలో మొత్తం ఏడుగురు అధికారులతో క‌మిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


Also Read: Talliki Vandanam Scheme: తల్లికి వందనంపై కీలక ప్రకటన.. ఎంత మంది ఉంటే వారికి రూ.15 వేలు


క‌మిటీలో స‌భ్యులు
ఆర్‌ అండ్ బీ, వీఎంసీ, ఏపీసీపీడీసీఎల్, ఏపీసీఆర్డీఏ, ఏడీసీఎల్ చీఫ్ ఇంజినీర్లు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఒక ప్ర‌తినిధి
ఏపీసీఆర్డీఏలో ప‌నుల‌కు సీఆర్డీఏ సీఈ క‌న్వీన‌ర్‌గా.. ఏడీసీఎల్ ప‌నుల‌కు క‌న్వీనర్‌గా ఏడీసీఎల్ సీఈ


కమిటీ బాధ్యతలు
అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం 9 అంశాల‌పై కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉంది. నెల ‌రోజుల్లోగా క‌మిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ‌ధాని నిర్మాణంలో ప‌నుల ప్ర‌స్తుత ప‌రిస్థితిని సాంకేతిక క‌మిటీ అధ్యయనం చేయనుంది. మే 2019 నుంచి నిలిచిపోయిన వివిధ భ‌వ‌నాల ప‌టిష్ట‌తను కమిటీ అంచ‌నా వేయ‌నుంది.


అధ్యయనం చేసే అంశాలు ఇవే..


  • రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా కోసం వేసిన పైప్ లైన్లు, విద్యుత్, క‌మ్యూనికేష‌న్ ప‌నుల‌కు జ‌రిగిన న‌ష్టం అంచ‌నా వేయనున్న క‌మిటీ

  • రాజ‌ధానిలోని పలు ప్రాంతాల్లో మిగిలి ఉన్న నిర్మాణ సామగ్రి నాణ్యత ప‌రిశీల‌న‌.

  • పైపులు, ఇనుము, ఇత‌ర సామగ్రి సేవా సామ‌ర్ధ్యం అంచ‌నా

  • అవ‌స‌ర‌మైన చోట తిరిగి పరికరాలు అమ‌ర్చ‌డంపై ప‌లు సూచ‌న‌లు

  • నిలిచిపోయిన అన్ని ప‌నుల‌పై ఎలా ముందుకెళ్లాల‌నే దానిపై సిఫార్సులు.

  • నిలిచిపోయిన ప‌నులు ఎక్క‌డి నుంచి ప్రారంభించాల‌నే దానిపై నిర్ధిష్ట‌మైన సూచ‌న‌లు

  • వివిధ కాంట్రాక్ట్ సంస్థ‌ల నుంచి వ‌చ్చే క్లెయిమ్‌ల‌ను అధ్య‌య‌నం చేసి సిఫార్సులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి