AP Cabinet Decisions: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు విధానాలు తీసుకొచ్చినట్లు చెప్పారు. థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ గ్లోబల్లీ నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఎలక్ట్రానిక్స్‌, పారిశ్రామిక, క్లీన్‌ ఎనర్జీ, గ్రీన్‌ ఎనర్జీ పాలసీలు తొసుకొచ్చినట్లు వివరించారు. వాటితోపాటు పర్యాటక, ఐటీ, వర్చువల్‌ వర్కింగ్‌ పాలసీలు కూడా తీసుకువస్తున్నట్లు తెలిపారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవారి మెట్ల మార్గం మూసివేత


అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు కొన్ని సూచనలు ఇచ్చారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు కొన్ని గంటల పాటు మంత్రిమండలి నిర్ణయాలను వివరించారు. ఈ సందర్భం గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా డ్రగ్స్‌, గంజాయిపై ఉక్కుపాదం తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. మంత్రివర్గంలో చెత్త పన్ను రద్దుపై నిర్ణయం తీసుకోవడం విశేషం.

Also Read: AP Cabinet: దీపావళి ధమాకా.. గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలు..


 


గంజాయి, డ్రగ్స్ నివారణ  కోసం ఐదుగురి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారిస్తామని చెప్పారు. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మా పార్టీ వాళ్లు అయినా కూడా నేరాలకు పాల్పడితే.. వదిలి పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గంజాయి తాగి తిరిగితే అదే రోజు సంఘ బహిష్కరణ చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ధరల నియంత్రణ కోసం నలుగురి మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 'చెత్త మీద పన్ను.. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. చెత్త మీద పన్ను  తీసేశాం. ఉచిత ఇసుక సరఫరాలో ఎలాంటి రాజకీయం ఉండకూడదు అని మా మంత్రులకు కూడా హెచ్చరించా' అని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


మంత్రిమండలి ఆమోదం పొందిన ఆరు విధానాలు ఇవే..


  1. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ  రూపకల్పనకు ఆమోదం. 

  2. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 (2024 – 2029)

  3. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 (2024 – 2029)  ఆమోదం

  4. ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024 – 2029)

  5. 'ప్లగ్ అండ్ ప్లే' ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 4.0 (2024-29)తో ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు సంబంధించి కొత్త విధానం

  6. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0 (2024 – 2029)


మంత్రిమండలి నిర్ణయాలు ఇవే!


  • కృష్ణా జిల్లా మల్లవల్లిలోని పారిశ్రామిక పార్కుకు సంబంధించిన కొన్ని సమస్యలపై ఏపీఐఐసీ ప్రతిపాదించిన ప్రణాళికకు ఆమోదం. దాదాపు 150 ఎకరాల్లో అందుబాటులో ఉన్న ప్లాట్లను 349 మంది కేటాయింపుదారులకు తిరిగి కేటాయించడంతో పాటు లేఅవుట్‌ను క్రమబద్ధీకరించడం. పారిశ్రామిక పార్కులో ప్లాట్ల రేట్లపై  కేటాయింపుదారుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం గతంలో జారీచేసిన జీఓ నంబర్‌ 78లో నిర్ణయించిన ధర ప్రకారం ఎకరం రూ.16.50 లక్షలకు కేటాయించాలని చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.

  • స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ పథకం కింద మల్లవల్లిలో మౌలిక సదుపాయాల కల్పన పనులకు రూ.వెయ్యి కోట్ల రుణానికి ప్రభుత్వ హ్యండ్ హోల్డింగ్‌కు ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదన ఆమోదం.

  • ధరల పర్యవేక్షణ, నియంత్రణ , మార్కెట్ లో జోక్యంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు  రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

  • రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, అక్రమ మద్యం, బాధితుల పునరావాసం వంటి తదితర అంశాలపై అధ్యయనం చేయడంతో పాటు సిఫార్సులు చేసేందుకు మంత్రుల బృందం ఏర్పాటుకు ఆమోదం.

  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి.

  • రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మాదకద్రవ్యాల వాడకం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ (ఏపీఏఎన్టీఎఫ్) ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటుకు నిర్ణయం. దీంతోపాటు 26 జిల్లాల్లో  నార్కోటిక్స్ పోలీసు బృందాలు ఏర్పాటుకు ఆమోదం.

  • ఏపీ హైకోర్టు ఆధ్వర్యంలో జిల్లాల్లో 5 ప్రత్యేక కోర్టులు లేదా 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటుకు నిర్ణయం.

  • చెత్త పన్ను రద్దుకు మంత్రిమండలి తీర్మానం.

  • గ్రామీణ, పంచాయతీ, పట్టణ రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా గత మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రహదారుల మరమ్మత్తులకు చేపట్టిన పనుల ప్రగతిని తెలిపే స్టేటస్ నోట్‌కు మంత్రి మండలి ఆమోదం. గుంతల రహిత రహదారుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలనే తక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లన్నింటినీ యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు పనులు చేయాలని నిర్ణయం.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.