AP Cabinet: నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో దీపావళికి ప్రజలకు ఉచిత సిలిండర్స్ తో పాటు..0 వరద ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. చెత్త పన్ను రద్దుపైనా.. 13 మున్సిపాలిటీలలో 190 పోస్టుల భర్తీపైనా మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దేవాలయాల్లో పాలకమండళ్ల నియామకంపైనా ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. పాలకమండళ్లలో సభ్యుల సంఖ్యను 15 నుంచి 17 పెంచాలని, ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా తీసుకోవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.
దీనిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇక స్వర్ణకారుల సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటుపైనా కేబినెట్ చర్చించనుంది. ఇక మహిళలపై అఘాయిత్యాలను కట్టడి చేసేందుకు.. మహిళలపై దాడులకు పాల్పడేవారికి త్వరగా శిక్షలు పడేలా ఈ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుపైనా ఏపీ మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది.
నూతన పారిశ్రామిక విధానంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా, పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇండస్ట్రియల్ పాలసీ రూపొందించనున్నారు. మొత్తం 10 శాఖల్లో కొత్తగా ఆరు పాలసీలను చర్చించనున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!
ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..
పారిశ్రామిక అభివృద్ధి, MSME, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన పాలసీలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ప్రోత్సాహకాలపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter