Chandrababu Tea: `నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు`.. చాయ్ పెట్టిన చంద్రబాబు వీడియో వైరల్
Chandrababu Tea Making Video Viarl: ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా స్వయంగా టీ కాచిన వీడియో వైరల్‌గా మారింది. చంద్రబాబు చాయ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
Deepam Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీని ప్రారంభించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని చంద్రబాబు ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. అయితే లబ్ధిదారుకు గ్యాస్ పంపిణీ చేసిన అనంతరం సీఎం చంద్రబాబు స్వయంగా ఆమె ఇంట్లో టీ చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Also Read: Free Gas Cylinder: మహిళలకు దీపావళి పండుగే.. ఉచిత గ్యాస్ సిలిండర్లకు చెక్కు అందజేత
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఈదుపురంలో ఉచిత గ్యాస్ పథకంలో భాగంగా దీపం - 2.0 కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈదుపురం గ్రామంలో శాంతమ్మ అనే లబ్ధిదారు ఇంట్లో స్వయంగా చంద్రబాబు గ్యాస్ స్టౌ వెలిగించారు. అనంతరం పాల ప్యాకెట్ కోసి గిన్నెలో పాలు పోసి, టీ పొడి వేసి చాయ్ తయారు చేశారు. ఆ మహిళతో నవ్వుతూ.. 'నాకు టీ పెట్టడం నేర్పిస్తున్నావు' అని చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో కేంద్ర వైమానిక శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నవ్వుకున్నారు. ఆయన పెట్టిన చాయ్‌ని సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు, అధికారులు తాగారు.
Also Read: YSR Family Dispute: వైఎస్ విజయమ్మ చెప్పిన ఆస్తుల చిట్టా ఇదే.. జగన్, షర్మిలకు రావాల్సిన ఆస్తులివే!
లబ్ధిదారులతో మాట్లాడిన అనంతరం ఒకటో తేదీ కావడంతో పింఛన్‌దారులకు రూ.4 వేల పింఛన్ స్వయంగా చంద్రబాబు అందించారు. ఈదుపురంలోని బడేపల్లిలో ఒంటరి మహిళ జానకికి సీఎం చంద్రబాబు రూ.4 వేల పింఛన్ డబ్బులు అందజేశారు. ఆమె కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఇల్లు బాగా లేకపోవడంతో అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు ఆమెకు వెంటనే ఇల్లు కట్టి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీపం పథకం మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు సీఎం చంద్రబాబు ఇటీవల అందించిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
ఏడాదికి మూడు సిలిండర్ల చొప్పున ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దీనికయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున లబ్ధిదారులకు అందించనున్నారు. ఏడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుండడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook