Add Zee Business As A Preferred Source
App

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

Published: Oct 27, 2024, 11:44 AM IST|Updated: Oct 27, 2024, 11:44 AM IST
టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో అంశాలు కొన్ని వెలుగు చూస్తుంటాయి. మరి కొన్ని తెరదాటకుండా మిగిలిపోతుంటాయి. అలాంటిదే మరో అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ కలిగిన నటుడు విక్టరీ వెంకటేశ్ గురించిన రహస్యమిది. విషయం ఏంటంటే వెంకటేశ్ ఒకప్పుడు ఆ హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Venkatesh Second Marriage: టాలీవుడ్ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో అంశాలు కొన్ని వెలుగు చూస్తుంటాయి. మరి కొన్ని తెరదాటకుండా మిగిలిపోతుంటాయి. అలాంటిదే మరో అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో క్లీన్ ఇమేజ్ కలిగిన నటుడు విక్టరీ వెంకటేశ్ గురించిన రహస్యమిది. విషయం ఏంటంటే వెంకటేశ్ ఒకప్పుడు ఆ హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Tollywood actor victory venkatesh second marriage updates1/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ స్టార్ హీరోగా ప్రాచుర్యం పొందిన ఒకే ఒక్కడు విక్టరీ వెంకటేశ్. వెంకటేశ్ సినిమాలు కుటుంబ సమేతంగా చూడదగ్గవిగా ఉంటాయి. దగ్గుబాటి రామానాయుడు కుమారుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వెంకటేశ్‌కు క్లీన్ ఇమేజ్ ఉంది. వివాదాలకు దూరంగా ఉంటాడు. 

Tollywood actor victory venkatesh second marriage updates2/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

వెంకటేశ్ ఎప్పుడూ ఫ్యామిలీ సినిమాలే చేస్తుంటాడు. అందుకే ఇంట్లో కుటుంబం అంతా కలిసి చూస్తుంటారు. మాస్ సినిమాలకు చాలా దూరం. నిజ జీవితంలో కూడా అంతే. ఏ వివాదాల్లోనూ ఉండడు. ఎలాంటి ఆరోపణల్లేవు. 

Tollywood actor victory venkatesh second marriage updates3/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

అలాంటి విక్టరీ వెంకటేశ్ విషయంలో 1990 దశకంలో ఓ పుకారు బాగా వైరల్ అయింది. అప్పట్లో సోషల్ మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది..లేకపోతే అందరికీ ప్రచారమైపోయేది. భార్యకు విడాకులిచ్చి అప్పటి స్టార్ హీరోయిన్‌ను రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారనేది ఆ వార్త. 

Tollywood actor victory venkatesh second marriage updates4/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

అవును..నిజమే. అప్పటి మేటి హీరోయిన్ సౌందర్యను పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు వ్యాపించాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో అత్యధిక సినిమాలు రావడం కూడా ఓ కారణం. ఇదే విషయమై వెంకటేశ్‌కు, అతని భార్య నీరజకు గొడవలు కూడా జరిగాయట.

Tollywood actor victory venkatesh second marriage updates5/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

పుకార్లు గట్టిగా వ్యాపిస్తుండటంతో అప్రమత్తమైన వెంకటేశ్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు సౌందర్యను పిలిచి అడగగా ఏమీ లేదని సమాధానమిచ్చింది. ఇద్దరి మధ్య మరే బంధమేదీ లేకుంటే రాఖీ కట్టమని చెప్పి వెంకటేశ్‌కు రాఖీ కట్టింది కూడా. 

Tollywood actor victory venkatesh second marriage updates6/6

Venkatesh Second Marriage: విక్టరీ వెంకటేశ్ రెండో పెళ్లి..ఆ హీరోయిన్‌తో జరిగిందా, అసలేం జరిగింది

అలా ఈ ఇద్దరి మధ్య వ్యాపించిన పుకారుకు తెరపడింది. ఈ వార్త అప్పట్లోనే తెలుగు సినిమా పరిశ్రమలో హల్‌చల్ రేపింది. ఇప్పటిలా సోషల్ మీడియా అప్పుడు ఉండి ఉంటే ఎంత నష్టం జరగాలో అంత జరిగే ఉండేది. ఇద్దరి మధ్య బంధం విషయం నిజమో కాదో తెలియదు కానీ రాఖీతో సమస్యకు చెక్ పెట్టారు దగ్గుబాటి.