Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి వరద గండం..
Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అంతేకాదు పలు జిల్లా కేంద్రాల్లో సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసారు. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసాన్ని వరద ముంచెత్తే అవకాశాలున్నాయి. ఏ క్షణంలోనైనా ఇంట్లోకి వరద నీరు చేరే అవకాశాలున్నాయి.
కృష్ణానదికి భారీగా వస్తున్న వరదత ప్రవాహంతో ప్రమాదంలో చంద్రబాబు ఇల్లు ఉంది. కృష్ణానది కరకట్ట ప్రాంతంలో కట్టిన భవనంలో నివాసం ఉంటున్నఏపీ సీఎం చందబాబు. గతంలో నది కరకట్ట ప్రాంతంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారంటూ అప్పటి జగన్ ప్రభుత్వం ఆ ఇంటిని నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే కదా. గతంలో 5 .5 లక్షల క్యూసెక్కుల నీటికే చంద్ర బాబు ఇంట్లోకి వరద నీరు చేరింది. ఇపుడు అక్కడ 5.83 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది. మరో 20 వేల క్యూసెక్కుల వరద వస్తే సీఎం చంద్రబాబు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మొత్తంగా సీఎం ఇంటికే వరద నీరు ముంచెత్తడం ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా తన ఇంటిని కరకట్టలో నిర్మించుకోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడినట్టు ప్రతిపక్షం వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. మరి రెండో రోజులు అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. దీంతో చంద్రబాబు ఉన్న ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి వెళతారా లేదా అనేది చూడాలి.
సీఎం నివాసంలోకి వరద చేరకుండా అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ప్రస్తుతం వరద నీరుతో చంద్రబాబు నివాసం ఉంటున్న చుట్టుపక్కల ప్రదేశాలు మొత్తం జలమయమయ్యాయి.
మరోవైపు ఏపీలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు గత 30 యేళ్లలో ఎన్నడు లేనంత భారీ వర్షం విజయవాడలో కురిసింది. చరిత్రలో ఎన్నడు లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిగత రికార్డులను తిరగరాసింది. అంతేకాదు గత రెండు రోజులు విజయవాడలో కుండపోత వర్షాలకు అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు నిలిచిన నీరు. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరో రెండు రోజులు పాటు ఏపీలో అల్పపీడన ప్రభావంతో మరింత భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.