Chiranjeevi Disaster Movies: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. దాంతో పాటు అదే రేంజ్ లో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి. అందులో ‘భోళా శంకర్’, ‘ఆచార్య’ సహా ఏయే చిత్రాలున్నాయో మీరు ఓ లుక్కేయండి..

1 /10

మొత్తంగా చిరంజీవి కెరీర్ లో పూలపాన్పుల వంటి బ్లాక్ బస్టర్స్ తోప పాటు ముళ్ల వంటి డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి చిరు కెరీర్ లో స్పీడ్ బ్రేకర్స్ లా మారాయి తప్పించి ఆయన ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించలేకపోయాయి.

2 /10

భోళా శంకర్ మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో హిట్టైన ‘వేదాలం’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

3 /10

ఆచార్య మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

4 /10

శంకర్ దాదా జిందాబాద్ చిరంజీవి హీరోగా పవన్ కళ్యాణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన చిత్రం ‘శంకర్ దాదా జిందాబాద్’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

5 /10

అంజి కోడి రామకృష్ణ దర్శకత్వంలో యం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంజి’. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.

6 /10

మృగరాజు మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్  దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మృగరాజు’. ఈ సినిమా చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.

7 /10

బిగ్ బాస్ విజయ బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘బిగ్ బాస్’. ఈ సినిమా చిరు కెరీర్ లో అత్యంత దారుణమైన పరాజయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

8 /10

రిక్షావోడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రిక్షావోడు’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది.

9 /10

లంకేశ్వరుడు చిరంజీవి హీరోగా దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లంకేశ్వరుడు’. ఈ సినిమా చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

10 /10

మరోవైపు చిరంజీవి కెరీర్ లో ఎస్పీ పరశురాం, రాజా విక్రమార్క, జేబు దొంగ, ఆరాధన, కిరాతకుడు, వేట వంటి ఎన్నో డిజాస్టర్ మూవీస్ ఉన్నాయి.