Raghurama Krishnam Raju: ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు.. ఆ స్థానం నుంచి టికెట్ కన్ఫార్మ్
Raghurama Krishnam Raju Latest News: ఎంపీ రఘురామకృష్ణరాజు ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఆయన టికెట్‌ను చంద్రబాబు నాయుడు కన్ఫార్మ్ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో RRR ను అభ్యర్థిగా ప్రకటించారు.
Raghurama Krishnam Raju Latest News: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఆయనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు టికెట్ ఖరారు చేశారు. ఉండి నుంచి రఘురామ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రకటించారు. శుక్రవారం పాలకొల్లులో రఘురామ టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా కొద్ది రోజుల క్రితం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రామరాజుకు ఉండి టికెట్ కేటాయించారు. తాజాగా ఆయన స్థానంలో RRR పోటీ చేయనున్నారు. దీంతో రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. నరసాపురం ఎంపీగా పోటీ చేద్దామని రఘురామ అనుకున్నా.. పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఈ సీటు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపించారు. పాలకొల్లు ప్రజాగళం సభలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.
Aslo Read: BRS To TRS: బీఆర్ఎస్ పేరును మార్చే ఆలోచనలో ఉన్నాం... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లి..
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం రఘురామకృష్ణం రాజు అన్నారు. గత నాలుగేళ్లుగా తాను అనివార్య కారణాల వల్ల రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తన ప్రాణాలకు ముప్పు వాటిల్లిన సమయంలో చంద్రబాబు కాపాడారని గుర్తు చేసుకున్నారు. తనపై కేసులు పెట్టినప్పుడు ఆ రోజు రాత్రి ఆయన నిద్రపోకుండా న్యాయవాదులతో మాట్లాడారని చెప్పారు. తన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని అన్నారు.
తెలుగుదేశం, బీజేపీ, జనసేన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు RRR. చంద్రబాబుకు తన కోసం ఎంతో చేశారని.. ఉన్నాను, విన్నాను అని కొందరు సొల్లు కబుర్లు చెబుతారంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అలాంటి వ్యక్తి కాదన్నారు. నిజంగా ఆయన తనకు ఉన్నారని.. తన ఆక్రోశం, బాధ విన్నారు కాబట్టే ఆయన ఇవాళ చెప్పినట్లు తాను ప్రజల ముందు బతికున్నానని చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ ప్రభంజనం సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ త్రిమూర్తుల కలయిక ఉంటుందని తాను సంవత్సరంగా చెబుతూనే ఉన్నానన్నారు.
ప్రధాని మోదీ బ్రహ్మ అయితే.. విష్ణుమూర్తి చంద్రబాబు అని, పవన్ కళ్యాణ్ పరమశివుడు అని అన్నారు. మనమందరం సైనికులమన్నారు. జై టీడీపీ, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోదీ అంటూ రఘురామ భావోద్వేగపూరితంగా వ్యాఖ్యలు చేశారు.
Also Read: Realme 12X 5G Price: రియల్‌మీ నుంచి అదిరిపోయే మొబైల్.. రూ.14,999లోపే ది బెస్ట్ Realme 12X 5G..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook