Realme 12X 5G Price: రియల్‌మీ నుంచి అదిరిపోయే మొబైల్‌.. రూ.14,999లోపే ది బెస్ట్‌ Realme 12X 5G..

Realme 12X 5G Price: ప్రీమియం ఫీచర్స్‌తో Realme నుంచి మరో మొబైల్ మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ Realme 12X 5G మోడల్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 6, 2024, 01:39 PM IST
Realme 12X 5G Price: రియల్‌మీ నుంచి అదిరిపోయే మొబైల్‌.. రూ.14,999లోపే ది బెస్ట్‌ Realme 12X 5G..

Realme 12X 5G Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ రియల్‌మీకి మార్కెట్‌లోకి మంచి డిమాండ్‌ ఉంది. దీనిని కంటిన్యూ చేసేందుకు రియల్‌మీ ప్రతి సంవత్సరం కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. అయితే ఈ సంవత్సరంలో కూడా రియల్‌మీ కొత్త మొబైల్‌ను లాంచ్‌ చేసింది.  ఇటీవలే Realme 12X 5Gని తక్కువ ధరకు విడుదల చేసింది. ఈ మొబైల్‌ ప్రీమియం ఫీచర్స్‌తో డెడ్ ఛీప్ ధరకే లభిస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 6100+ SoC ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌  SuperVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో  అందుబాటులోకి వచ్చింది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీంతో పాటు అనే రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లో లభిస్తోంది. 

ఇక Realme 12X 5G స్పెసిఫికేషన్ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది  120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేసే 6.72-అంగుళాల పూర్తి-HD+ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ 2,400 x 1,080 పిక్సెల్‌లు రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. అలాగే 950 nits పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభిస్తోంది. ఇది ఇలా ఉండగా..ఈ మొబైల్‌ ఎంతో శక్తివంతమైన 6nm MediaTek డైమెన్సిటీ 6100+ SoC ప్రాసెసర్‌పై పని చేస్తుంది. గేమింగ్‌, మాల్టీ టాస్కింగ్‌ చేసేవారికి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది Mali-G57 MC2 GPU సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు ఇది 8GB LPDDR4x ర్యామ్‌తో పాటు 128GB UFS 2.2 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఆప్షన్‌లో లభిస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన కెమెరాతో కంపెనీ దీనిని లాంచ్‌ చేసింది. 

అలాగే ఈ Realme 12X 5G స్మార్ట్‌ఫోన్‌ కూల్ బటన్ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది గతంలో రియల్‌మీ 12 5G మోడల్‌లో లాంచ్‌ చేసింది. ఈ డైనమిక్ బటన్ ద్వారా ప్రీమియం ఫోటోస్‌ను పొందవచ్చు. ఈ ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా ఎయిర్‌ప్లేన్, DND వంటి మోడ్‌లను కూడా పొందవచ్చు. అలాగే కెమెరా షట్టర్, ఫ్లాష్‌లైట్, అనేక ఇతర ఫంక్షన్స్‌ను కూడా కలిగి ఉంటుంది.  ఇందులో ఎయిర్ గెస్చర్ ఫీచర్‌ కూడా లభిస్తోంది. దీంతో పాటు అనేక కెమెరా ఫీచర్స్‌ను కలిగి ఉంటుందని రియల్‌మీ కంపెనీ వెల్లడించింది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే, ఇది డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఈ మొబైల్‌ బ్యాక్‌సెటప్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ను కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫ్రాంట్‌ భాగంలో డిస్ప్లే  హోల్-పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. దీని బ్యాటరీ విషయానికొస్తే, 5,000mAh బ్యాటరీతో 45W వైర్డ్ SuperVOOC ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌ ధర విషయానికొస్తే..రూ.14,999లోపే అందుబాటులోకి వచ్చింది. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News