Chandrababu Stay In Bus: వర్షాలపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన బావమరిది నందమూరి బాలకృష్ణకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా వర్షాలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలను ఆదుకునేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌లోనే సీఎం గడపనున్నారు. లగ్జరీ హోటల్‌లో కాకుండా బస్సులోనే నిద్రించనున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Nara Lokesh: 'గుడ్లవల్లేరు కాలేజ్‌లో రహాస్య కెమెరాలు లేవు..ఏం లేవు' మీడియాపై నారా లోకేశ్‌ చిందులు


 


వర్షాలపై సమీక్షిస్తున్న చంద్రబాబు నాయుడు విజయవాడలో పర్యటించారు. అంతేకాకుండా విజయవాడ కలెక్టరేట్‌లో వరుస సమీక్షలు జరుపుతూ ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు చేస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో వర్షం ముప్పు పొంచి ఉండడంతో సీఎం కలెక్టరేట్‌లోనే ఉండనున్నారు. రాష్ట్ర పరిస్థితులపై నిరంతరం సమీక్ష చేయడానికి అధికారులతో నిరంతరం సంప్రదింపులు చేసేందుకు కలెక్టరేట్‌లో గడపాలని సీఎం నిర్ణయించారు. దీంతో విజయవాడ కలెక్టరేట్‌ ముఖ్యమంత్రి కార్యాలయంగా మారిపోయింది.

Also Read: Chandrababu Review: ఆదివారం సెలవు రద్దు.. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు


 


బాలకృష్ణ కార్యక్రమం రద్దు
వాస్తవంగా హైదరాబాద్‌లో జరిగిన బాలకృష్ణ స్వర్ణోత్సవ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వరద పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని బాలకృష్ణకు ఫోన్‌ చేసి చెప్పారు. 'రాష్ట్రంలో వరదల నేపథ్యంలో స్వర్ణోత్సవ వేడుకలకు రావడం లేదు' అని చెప్పారు. అనంతరం బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.


కలెక్టరేట్‌లోనే బస
విజయవాడలోని సింగ్ నగర్‌లో పర్యటించిన అనంతరం సీఎం చంద్రబాబు హైదరాబాద్‌ పర్యటన రద్దు చేసుకున్నారు. విజయవాడలో సాధారణ పరిస్థితి  వచ్చేవరకు  కలెక్టరేట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చాక ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తానని అధికారులతో చెప్పారు. అయితే ఆయన కలెక్టరేట్‌లోని బస్సులో నిద్రపోతారని సమాచారం. సీఎం వెంట హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని ఉండనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter