Chandrababu Arrest: చంద్రబాబుకు మళ్లీ నిరాశ, బెయిల్‌పై విచారణ వాయిదా వేసిన హైకోర్టు
Chandrababu Arrest: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయి. హైకోర్టులో బెయిల్ పిటీషన్లపై విచారణ వాయిదా పడటంతో నిరాశ ఎదురౌతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Arrest: ఓ వైపు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు మరోవైపు ఇతర కేసులతో చంద్రబాబును చుట్టుముట్టేందుకు పోలీసులు సిద్ధమౌతున్నారు. స్కిల్ కేసుకు తోడుగా ఇతర కేసులు సిద్ధమౌతున్నాయి. ఇతర కేసుల్లో బెయిల్ కోరుతూ దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో చంద్రబాబుకు నిరాశ తప్పలేదు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు మరోసారి నిరాశ ఎందురైంది. రిమాండ్ ఖైదీ చంద్రబాబును ఇతర కేసులు కూడా వెంటాడుతున్నాయి. అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు పర్యటన సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనల్లో చంద్రబాబుపై కేసు నమోదైంది. ఇతర నిందితులు ముందస్తు బెయిల్ తీసుకున్నా చంద్రబాబు అప్పట్లో తీసుకోలేదు కానీ ఇప్పుడు పరిస్థితి మారడంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 20కు వాయిదా వేసింది. పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా సమర్పించాల్సి ఉండటంతో హైకోర్టు వాయిదా వేసింది. ఎందుకంటే పోలీసులు సమర్పించాల్సిన వివరాల ఆధారంగానే హైకోర్టు బెయిల్‌పై నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌ను క్వాష్ చేయాల్సిందిగా హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ కూడా ఈ నెల 18న విచారణ జరగనుంది. ఈలోగా అంగళ్ల కేసులో చంద్రబాబు అరెస్ట్ జరిగితే పీటీ వారెంట్‌పై మరో జైలుకు తీసుకెళ్లవచ్చు. అంటే స్కిల్ కేసులో ఒకవేళ బెయిల్ లభించినా మరో కేసులో అరెస్టుకు రంగం సిద్దమైంది. ఇది గ్రహించే చంద్రబాబు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తే అది కాస్తా వాయిదా పడింది.
Also read: Ap Cm Jagan Delhi Tour: ఢిల్లీకి ఏపీ సీఎం జగన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook