Chandrababu 100 Days: అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం సంబరాలకు సిద్ధమవుతోంది. 'ఇది మంచి ప్రభుత్వం' పేరిట వారోత్సవాలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేసింది. బీజేపీ, టీడీపీ, జనసేన నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్‌ వంద రోజుల్లో చేసిన సంక్షేమ, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించేందుకు ప్రతి గడపకు వెళ్లనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. సిక్కోలు నుంచి ఇది మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించనున్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Tirumala Laddu: తిరుమల నెయ్యిపై చంద్రబాబు వ్యాఖ్యలు వైఎస్‌ షర్మిల ఖండన.. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. కవిటి మండలం రాజపురం గ్రామంలో గురువారం నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని  ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు రోజులపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించనున్నారు.

Also Read: Pawan Kalyan: భూమి కొంటే ఆ పత్రంపై జగన్ బొమ్మ ప్రత్యక్షం.. డిప్యూటీ సీఎం పవన్‌కు విచిత్ర అనుభవం


ఈ కార్యక్రమం కోసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి చంద్రబాబు నాయుడు  వస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. సిక్కోలు ప్రాంతమే కాకుండా ఉత్తరాంధ్ర నుంచి పార్టీ నాయకులు తరలిరానున్నారు. ఇది మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.


ఏర్పాట్లు పరిశీలన
ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి గురువారం పరిశీలించారు. రాజపురంలో ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. వింధ్యగిరిలో ఏర్పాటు చేయనున్న హెలిపాడ్ నుంచి రూట్ మ్యాప్, రాజపురంలో నిర్వహించే రచ్చబండ వేదిక ఏర్పాటు పరిశీలించారు. తొలుత నలుగురు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వారితో ముచ్చటించే కార్యక్రమానికి  సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా చూశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.