ap Cm Chandrababu naidu warning to vasam setti audio leake: ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలనలో ఎక్కడ కూడా రాజీపడటం లేదని తెలుస్తొంది. ఎక్కడ చూసిన కూడా మంత్రుల్ని, అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు.  ఇటీవల ఏపీలో వరదలు వచ్చినప్పుడు కూడా సీఎం చంద్రబాబు సూచనలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. స్వయంగా రంగంలోకి దిగి మంత్రుల్ని, అధికారులకు ముచ్చెమటు పట్టించారు. ప్రజలకు తానున్నానని  భరోసా సైతం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. తాజాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాస్ కు క్లాస్ పీకినట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికల సభ్యత్వలు నమోదు చేయించడంతో మంత్రి వెనుకబడి ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటి వరకు కేవలం 29 శాతం మాత్రమే ఎమ్మెల్సీ ఓట్ల సభ్యత్వ నమోదు చేయించినట్లు సమాచారం. అయితే..  పట్ట భద్రుల ఎన్నికలకు సంబంధించి.. తొమ్మిది వేల మంది  ఓట్ల నమోదుకు లక్ష్యంగా పెడితే కేవలం 2వేల 300 ఓట్లు మాత్రమే చేయడంతో సీఎం చంద్రబాబు నుంచి మంత్రి సుభాష్ చివాట్లు తిన్నట్టుగా తెలుస్తోంది.


 ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మంత్రికి ఫోన్ చేసి చివాట్లు పెట్టినట్లు  సమాచారం. తొలిసారి ఎమ్మెల్యే అయిన కూడా మంత్రిగా గురుతర బాధ్యతలు అప్పగిస్తే.. ఇంత నెగ్లీజెన్సీగా ఉంటారా అని మండిపడినట్లు తెలుస్తొంది.  ఇలా అయితే కుదరదని.. తాము మరో ప్రత్యామ్నాయం చూస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.


అంతే కాకుండా.. యువనేత అంటూనే .. రాజకీయాలపై నీకింకా సీరియస్‌నెన్‌ రాలేదని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన కూడా..  మంత్రి ఇస్తే కనీసం నీకు ఆ పట్టుదల లేకపోతే ఎలా అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికి కూడా   ప్రూవ్ చేసుకొకుంటే.. ఎందుకు నీకు రాజకీయాలు అంటూ కూడా చంద్రబాబు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తొంది.


Read more: AP Pention: పెన్షనర్లకు ఊహించని శుభవార్త.. ఏపీ ప్రభుత్వం అదిరిపోయే దీపావళి గిఫ్ట్..


అయితే.. పార్టీ అధినేత వార్నింగ్ కు తన పనితీరు మార్చుకుంటానని మంత్రి సుభాష్ రిప్లై ఇచ్చినట్లు తెలుస్తొంది.  ఇప్పటికే సుభాష్ వ్యతిరేక వర్గం చంద్రబాబుకు తరచుగా ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఫోన్ చేసీ మరీ సుభాస్ కు క్లాస్ పీకారంట. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించి ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఆడియో ఎవరు రికార్డు చేశారు. ఎవరు లీక్ చేశారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.