Babu Vs Jagan: జగన్ ను మరో కోలుకోలేని దెబ్బ కొట్టిన చంద్రబాబు.. అసెంబ్లీలో వైయస్ఆర్సీపీకి ఆవిధంగా చెక్ పెట్టిన టీడీపీ..
Babu Vs Jagan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అంతేకాదు అసెంబ్లీలో చంద్రబాబు వేసిన ఎత్తుకు జగన్ చిత్తు అయ్యాడు. అంతేకాదు అసెంబ్లీలో కీలకమైన ఆ పదవి దక్కకుండా చేయడంలో బాబు సఫలమయ్యాడు.
Babu Vs Jagan: గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబును రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి చేసిన చంద్రబాబు నాయుడు.. తాజాగా అధికారంలో వచ్చాకా.. తన రాజకీయంలో ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పటికే జగన్ కు కుటుంబ పరంగా.. రాజకీయ పరంగా.. సోషల్ మీడియా పరంగా చెక్ పెట్టే వ్యూహంలో చంద్రబాబు దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తాజాగా అసెంబ్లీలో పీఏసీ - ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పదవి వైసీపీకి దక్కకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. అసలు పీఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ అసెంబ్లీలో వైసీపీకి ప్రజలు ప్రతపక్ష స్థానం దక్కకుండా చేశారు. మరోవైపు కీలకమైన పీఏసీ పదవి దక్కుతుందని ఆశపడ్డ వైసీపీ నేతలకు చంద్రబాబు తన వ్యూహంతో అడ్డుకట్ట వేయగలిగాడు.
తాజాగా ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ గా వైసీపీ నామినేషన్ దాఖలు చేసినా సరే పదవి దక్కే పరిస్థితి కనిపించడం లేదు. అనుకున్నట్లుగానే జనసేన పార్టీకి ఈ పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఎన్నిక దాదాపు ఖాయమైందని సమాచారం. ఈ రోజు వైఎస్సార్‌సీపీ నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అసెంబ్లీ కమిటీ హాల్‌లో పీఏసీ ఛైర్మన్ పదవికి పోలింగ్ జరుగుతుంది. ఈ ఎన్నిక బ్యాలెట్ పద్ధతిలో.. అసెంబ్లీ జరిగే సమయంలోనే నిర్వహిస్తారు.
అసెంబ్లీ నుంచి పీఏసీలో 9 మంది సభ్యులు ఉంటారు.. కూటమి పార్టీలు తొమ్మిది మందితో నామినేషన్లు దాఖలు చేయించారు. వైఎస్సార్‌సీపీ నుంచి అదనంగా ఒకరు వేయడంతో పోటీ అనివార్యమైంది.. దీంతో పోలింగ్ నిర్వహణకు అసెంబ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ పీఏసీ పోలింగ్ జరిగితే వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter