Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

Balayya Heroine: ఆ కథానాయిక  1990లలో స్టార్ హీరోయిన్ గా తెలుగు సహా ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చూపెట్టింది. అంతేకాదు అప్పటి స్టార్ హీరోలైన బాలకృష్ణతో పాటు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తో  సత్తా చాటింది. అటు బాలీవుడ్ లో కూడా సత్తా చూపెట్టింది. అంతేకాదు ఈమె ముగ్గురు స్టార్ హీరోలు.. ఓ క్రికెటర్‌తో ఎఫైర్ నడిపించిన ఘనత కూడా ఈమెదే. కానీ ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ లీడ్ చేస్తోన్న ఆ హీరోయిన్ ఎవరంటే.

1 /13

90లలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది నగ్మా. టాలీవుడ్ లో సుమన్ హీరోగా శరత్ దర్శకత్వంలో తెరకెక్కని ‘పెద్దింటల్లుడు’ చిత్రంతో కథానాయికగా  పరిచయం అయింది. ఆ తర్వాత చిరంజీవి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఘరానా మొగుడు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌ అయింది.

2 /13

ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘అశ్వమేథం’లో కథానాయికగా నటించింది. ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. స్టార్ కథానాయికగా ఎదిగినా నగ్మా..  కానీ వ్యక్తిగత జీవితం ఎపుడు హాట్ టాపిక్‌ అనే చెప్పాలి.

3 /13

నగ్మా  ఆన్ స్క్రీన్ హీరోలతో రొమాన్స్ మాత్రమే కాదు.. బిహైండ్ ది స్క్రీన్ కూడా రొమాన్స్ చేసినట్టు అప్పట్లో పుకార్లు షికార్లు చేసాయి. ఇందులో ముగ్గురు స్టార్ హీరోలతో పాటు ఓ క్రికెటర్ కూడా ఉండటం మైండ్ బ్లాంక్ చేసే  అంశమనే చెప్పాలి.

4 /13

నగ్మా 90లలో యువత కలల రాణి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ వంటి అప్పటి స్టార్ హీరోల సరసన నటించి హిట్స్ అందుకుంది.  అటు కేవలం సినిమాల పరంగానే కాదు.. రాజకీయాల్లోనే సత్తా చాటింది నగ్మా.  

5 /13

సినిమాల పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన నగ్మా  జీవితం మాత్రం ఎప్పటికీ వివాదాస్పదమే. ఈమె నలుగురు పెళ్లైన వాళ్లతో ఎఫైర్స్ నడిపిందనే వార్తలు అప్పట్లో సంచలనే రేపాయి. అందులో ముగ్గురు హీరోలు.. ఓ క్రికేటర్  కూడా ఉన్నారు. 

6 /13

1974లో హిందూ తండ్రికి ముస్లిమ్ అమ్మకు జన్మించింది నగ్మా. తండ్రి రాజస్థాన్ జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందిన వారు.  ఆ తర్వాత గుజరాత్‌కు, ఆపై ముంబైకు మకాం మార్చారు నగ్మా ఫ్యామిలీ మెంబర్స్. నగ్మా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, భోజ్‌పురి చిత్రాలతో పాపులరాలిటీ సంపాదించుకంది. తమిళనాడులో ఈమెకు అభిమానులు ఏకంగా గుడి కట్టేసారు. కానీ నగ్మా వ్యక్తిగత జీవితం కూడా వివాదాలతో ముడిపడి ఉంది.

7 /13

మీడియా కథనాల ప్రకారం అప్పట్లో నగ్మా టీమ్ ఇండియా కెప్టెన్ సౌరవ్ గౌంగులితో ఈమె ఘాటు ప్రేమాయణమే నడిపింది. అప్పట్లో తిరుపతిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సౌరబ్ భార్య జోక్యంతో వీరిద్దరి నగ్మా, సౌరభ్ ల  లవ్ ట్రాక్ కు  బ్రేక్ పడింది. ఆ తర్వాత ఎవరి జీవితంలో వారు ముందుకు వెళ్లారు.

8 /13

సౌరబ్ గంగూలి తర్వాత రాధిక ప్రస్తుత భర్త శరత్ కుమార్‌తో నగ్మా  కొన్నేళ్లు డేటింగ్ కూడా చేసిందనే వార్తలు పుకార్లు చేసాయి. రాధిక కూడా శరత్‌ కుమార్‌కు మూడో భార్య. అప్పటికే రాధిక రెండు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో శరత్ కుమార్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది. శరత్ కుమార్‌కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. ఇక రాధిక.. శరత్ కుమార్ జీవితంలోకి రావడంతో నగ్మాతో ఎఫైర్‌తో బ్రేక్ పడేలా చేసాయి. 

9 /13

ఇక తెలుగు, తమిళం, హిందీల్లో నగ్మా హవా తగ్గిన తర్వాత ఈమె భోజ్‌పురి సినీ ఇండస్ట్రీ వైపు  దృష్టి సారించింది. అక్కడ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈమె బోజ్‌పురి సూపర్ స్టార్ రవికిషన్ రేసు గుర్రం ఫేమ్‌తో ప్రేమాయణం నడిపింది.

10 /13

రీల్ లైఫ్ వీళ్ల కాంబినేషన్.. రియల్ లైఫ్‌లో కంటిన్యూ అయింది. కొన్నేళ్ల పాటు డేటింగ్ గట్రా చేసినట్టు బోజ్‌ పురి మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. ఇక నగ్మాతో తన ఎఫైర్ గురించి రవికిషన్ ఎపుడు దాచుకోలేదు. అప్పట్లో రవికిషన్ భార్య ప్రీతి.. అతనితో గొడవ పడిన సందర్బాలున్నాయి. ఆ తర్వాత రవికిషన్.. నగ్మాతో ఎఫైర్‌కు ఎండ్ కార్డ్ పడింది.  

11 /13

రవికిషన్‌తో విడిపోయిన తర్వాత నగ్మా మరో బోజ్‌పురి స్టార్ హీరో మనోజ్ తివారీతో ప్రేమాయణం నడిపిందనే వార్తలు వచ్చాయి.అప్పట్లో రవికిషన్, మనోజ్ తివారీ మధ్య బోజ్‌పురిలో పెద్ద పోటీ ఉండేది. అయితే మనోజ్ తివారీ మాత్రం నగ్మాతో సినిమాలు చేసినంత మాత్రానా.. ఎఫైర్స్ అంటకట్టడం ఏమిటి అని అప్పట్లో మీడియాపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

12 /13

అయితే ఈ వార్తలు వచ్చినపుడు సౌరబ్, శరత్ కుమార్, రవికిషన్, మనోజ్ తివారీ అందరు వివాహితులే కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఇక రవికిషన్, మనోజ్ తివారీ ఇద్దరు ఇపుడు బీజేపీ తరుపున లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. సౌరభ్ గంగూలి, శరత్ కుమార్ బీజేపీ పార్టీలో ఉన్నారు.  ఇక నగ్మా కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లో ప్రవేశించారు. ఈమె ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.  

13 /13

అయితే ఈ వార్తలు వచ్చినపుడు సౌరబ్, శరత్ కుమార్, రవికిషన్, మనోజ్ తివారీ అందరు వివాహితులే కావడం చెప్పుకోదగ్గ విశేషం. ఇక రవికిషన్, మనోజ్ తివారీ ఇద్దరు ఇపుడు బీజేపీ తరుపున లోక్‌సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. సౌరభ్ గంగూలి, శరత్ కుమార్ బీజేపీ పార్టీలో ఉన్నారు.  ఇక నగ్మా కూడా కాంగ్రెస్ పార్టీ తరుపున రాజకీయాల్లో ప్రవేశించారు. ఈమె ఉత్తర ప్రదేశ్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.