Chandrababu Revanth Reddy: ఒకప్పుడు ఇద్దరు కలిసి పని చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గురు శిష్యులుగా పని చేసిన వారిద్దరూ ఇప్పుడు పరిస్థితులు కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా మారారు. అయితే వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ అనుబంధం వీడినట్టు కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: AP Ministers: పవన్‌ కల్యాణ్‌కు ఊహించని పదవి.. చంద్రబాబు మంత్రివర్గ సభ్యులు వీరే..


 


తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేవంత్‌ రెడ్డి పని చేసిన విషయం తెలిసిందే. నాడు తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ తరఫున రేవంత్‌ రెడ్డి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు రహాస్య కార్యకలాపాలు, ఆపరేషన్లు కూడా రేవంత్‌ చేశారు. అదే క్రమంలో ఓటుకు నోటు కేసు తెలిసే ఉంటుంది. అంతటి అనుబంధం బాబు, రేవంత్‌ మధ్య ఉంది. మరి అలాంటి అనుబంధం ఏం జరిగిందో తెలియదు కానీ ప్రస్తుతం వారిద్దరూ దూరంగా ఉన్నారు.

Also Read: Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజే నిరుద్యోగులకు పండుగ.. తొలి సంతకం దానిపైనే


గతంలో బాబు రహాస్య ఆపరేషన్లు
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయబోతుండగా ఈ వేడుకకు రేవంత్‌ రెడ్డి హాజరు కావడం లేదు. హాజరు అనేది పక్కన పెడితే అసలు రేవంత్‌కు బాబు ఆహ్వానం పంపకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం అనంతరం రేవంత్‌ స్పందిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం ఓ ప్రెస్‌ మీట్‌లో చంద్రబాబు పిలిస్తే ప్రమాణస్వీకారానికి వెళ్తానని రేవంత్‌ బహిరంగంగా ప్రకటించారు. ఆయన వెళ్లడానికి సుముఖంగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆహ్వానం పంపకపోవడం గమనార్హం. శిష్యుడు రేవంత్‌కు గురువు చంద్రబాబు ఎందుకు ఆహ్వానం పంపలేదని చర్చ జరుగుతోంది. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఎందుకు ఆహ్వానం పంపలేదని ప్రశ్నలు మొదలవుతున్నాయి.


మర్యాదకు కూడా?
తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరైనా సరే సాధారణంగా పొరుగు రాష్ట్రం అనే భావనతో ప్రమాణస్వీకారానికి ఆహ్వానం పంపాల్సి ఉంది. పొరుగు రాష్ట్రంలో శిష్యుడే ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆహ్వానం తప్పక వెళ్తుందని.. రేవంత్‌ విధిగా హాజరవుతారని అందరూ భావించారు. కానీ వీటికి విరుద్ధంగా రేవంత్‌కు ఆహ్వానం దక్కకపోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. జాతీయ రాజకీయాలపరంగా చూస్తే చంద్రబాబు, రేవంత్‌ పరస్పరం బద్ధ శత్రువులు. రాజకీయం పక్కనపెట్టి పిలిస్తే చంద్రబాబు ఇండియా కూటమికి చేరువవుతారనే అభిప్రాయంతో ఆహ్వానం పంపలేదనేది ప్రధాన కారణంగా తెలుస్తోంది.


ప్రమాణస్వీకారానికి ఆహ్వానం రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి బుధవారం వేరే కార్యక్రమాలు ముందర వేసుకున్నారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన 8 మంది ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఎంపీలతో ఆయన భేటీ అవుతున్నారు. దీనికితోడు లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండడంతో ఎంపీలతో పలు విషయాలపై చర్చించనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter