AP Ministers: పవన్‌ కల్యాణ్‌కు ఊహించని పదవి.. చంద్రబాబు మంత్రివర్గ సభ్యులు వీరే..

Chandrababu Ministers List Here Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబుతోపాటు మొత్తం 25 మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీరే మంత్రులుగా నియమితులవుతున్నారని సమాచారం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 11, 2024, 07:57 PM IST
AP Ministers: పవన్‌ కల్యాణ్‌కు ఊహించని పదవి.. చంద్రబాబు మంత్రివర్గ సభ్యులు వీరే..

Chandrababu Ministers List: కూటమి ప్రభుత్వం బుధవారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆయనతోపాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనసభ పక్ష నాయకుడిగా చంద్రబాబును టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్నుకున్న విషయం తెలిసిందే. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ ప్రాంతంలో ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది.

Also Read: Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజే నిరుద్యోగులకు పండుగ.. తొలి సంతకం దానిపైనే

 

అయితే మంత్రులుగా ఎవరు ఉంటారో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించడంతో మంత్రివర్గ కూర్పు కొంత తలనొప్పిగా మారింది. మొత్తం 25 మంత్రులుగా ఎన్నుకునే సౌకర్యం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి భారీగా ఆశావహులు ఉన్నారు. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఆ రెండు పార్టీలకు దాదాపు ఆరు నుంచి 8 వరకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక మిగిలిన స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ఉండనున్నారు. అయితే ప్రచారం జరుగుతున్న ప్రకారం మంత్రులుగా వీరే ఉంటారని తెలుస్తోంది.

Also Read: Chandrababu Convoy: చంద్రబాబు కొత్త కాన్వాయ్‌ ప్రత్యేకతలు ఇవే.. భద్రతా ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా?

ఇక టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీకి మంత్రివర్గంలో భారీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించడం దాదాపుగా ఖరారైంది. ఆయన సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి కావడంతో సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కూడా అప్పగించే అవకాశం ఉంది. దీంతోపాటు గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమల శాఖ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. మరోసారి నారా లోకేశ్‌ ఐటీ మంత్రిగా ఎంపికవనున్నారు. కాగా మంత్రివర్గంలో సీనియార్టీతోపాటు గత అనుభవం, సామాజిక సమీకరణాలు వంటివి పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ కూర్పు చేశారు. ఏపీలో జరుగుతున్న చర్చ ప్రకారం మంత్రివర్గం ఇలా ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రుల వివరాలు

 1. నారా చంద్రబాబు నాయుడు (తెలుగు దేశం)    - ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాలనా విభాగం, నిర్మాణం పెట్టుబడులు, ఇతర కేటాయించని శాఖలు
 2. కొణిదెల పవన్ కళ్యాణ్ (జనసేన )- ఉప ముఖ్యమంత్రి, పరిశ్రమల శాఖ (చిన్న తరహా & భారీ), సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ
 3. కింజరాపు అచ్చెన్నాయుడు (తెలుగు దేశం)- ఆహార, పౌరసరఫరాల శాఖ, వినియోగదారుల సంబంధాలు
 4. కూన రవికుమార్ (తెలుగు దేశం)- పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, ఉపాధి హామీ
 5. ఆర్‌వీవీకే రంగారావు - బేబి నాయన (తెలుగు దేశం) - అటవీ శాఖ, సాంకేతిక శాఖ, సహకార
 6. గంటా శ్రీనివాసరావు (తెలుగు దేశం) - మానవ వనరుల శాఖ, విద్యా శాఖ (ప్రాథమిక, మాధ్యమిక, సాంకేతిక)
 7. చింతకాయల అయ్యన్న పాత్రుడు (తెలుగు దేశం)- కార్మిక శాఖ, మత్స్య శాఖ & పాడి పంటలు
 8. వంగలపూడి అనిత (తెలుగు దేశం)- హోం శాఖ, విపత్తు నిర్వహణ
 9. కొణతాల రామకృష్ణ (జనసేన) - న్యాయ శాఖ, విద్యుత్ శాఖ
 10. గోరంట్ల బుచ్చయ్య చౌదరి (తెలుగు దేశం) - వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ
 11. కామినేని శ్రీనివాసరావు (బీజేపీ) - ఆరోగ్య శాఖ
 12. నిమ్మల రామానాయుడు (తెలుగు దేశం) - సమాచార శాఖ & ప్రజా వ్యవహారాలు
 13. బొండా ఉమా మహేశ్వర రావు (తెలుగు దేశం)- నీటిపారుదల శాఖ
 14. వెనిగండ్ల రాము (తెలుగు దేశం)- యువత & క్రీడలు, వృత్తి నైపుణ్యం 
 15. కొల్లు రవీంద్ర (తెలుగు దేశం) - బీసీ సంక్షేమం, చేనేత శాఖ
 16. కన్నా లక్ష్మీ నారాయణ (తెలుగు దేశం) - రవాణా శాఖ, రోడ్లు భవనాల శాఖ 
 17. నారా లోకేష్ (తెలుగు దేశం) - ఐటీ శాఖ, ఎన్నారై వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖ
 18. నాదెండ్ల మనోహర్ (జనసేన)- రెవెన్యూ శాఖ, తపాలా శాఖ 
 19. ధూళిపాళ్ల నరేంద్ర (తెలుగు దేశం) - గృహ నిర్మాణం, దేవాదాయ శాఖ
 20. పొంగూరు నారాయణ (తెలుగు దేశం)- మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి శాఖ 
 21. పరిటాల సునీత (తెలుగు దేశం) - మహిళా శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ 
 22. పయ్యావుల కేశవ్ (తెలుగు దేశం) - ఆర్ధిక శాఖ, & పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు

పరిశీలనలో మరికొన్ని పేర్లు
టీ జగదీశ్వరి (తెలుగు దేశం), ఎస్‌వీఎన్ వర్మ (తెలుగు దేశం), దేవినేని ఉమామహేశ్వర రావు (తెలుగు దేశం), సుజనాచౌదరి (బీజేపీ), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (తెలుగు దేశం), నక్కా ఆనందం బాబు (తెలుగు దేశం), దామచర్ల జనార్థన రావు (తెలుగు దేశం), కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి (తెలుగు దేశం), పుట్టా సుధాకర్ యాదవ్ (తెలుగు దేశం), కాల్వ శ్రీనివాసులు (తెలుగు దేశం), కందుల దుర్గేశ్ (జనసేన), ఎన్ అమర్నాథ్ రెడ్డి (తెలుగు దేశం), బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి (తెలుగు దేశం) పేర్లు కూడా పరిశీలనలో ఉన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News