Chandrababu naidu review in Tirumala: అశ్వయుజం మాసంలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రతి ఏట.. సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈసారి కూడా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లడ్డు వివాదం రచ్చ నేపథ్యంలో.. ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా.. టీటీడీ ప్రత్యేకంగా చర్యలు కూడా తీసుకుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎంహోదాలో పట్టువస్త్రాలను సైతం సమర్పించారు. టీటీడీ ప్రత్యేకంగా స్వాగతం పలికింది. నిన్న (శుక్రవారం) తిరుమలకు చేరుకున్న చంద్రబాబు.. శ్రీవారి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) టీటీడీ అధికారులు, మంత్రులు, సిబ్బందితో సమీక్షను నిర్వహించారు. 


తిరుమలలో ప్రస్తుతం లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అదే విధంగా సుప్రీంకోర్టు సైతం.. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తును చేయాలని ఆదేశించింది. దీన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఈ నేపథ్యంలో.. తిరుమలలో స్వామివారి గోవింద నామస్మరణ పట్ల మరో మాట విన్పించకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు.


తిరుమల తిరుపతిలో ప్రశాతంతకు భంగం కలగజేసే ఎలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకొవాలన్నారు. ముఖ్యంగా.. శ్రీవారి కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించి ఏ విషయంలోనూ రాజీ పడొద్దని తెల్చిచెప్పారు. పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అడిషనల్ ఈవో, ఇతర అధికారులు పాల్గొన్నారు.


కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక తిరుమలలో గొప్ప మార్పులు జరిగాయని అన్నారు. గతప్రభుత్వం నిలిపివేసిన అన్నదానాలు, ఆహారంలో నాణ్యత, లడ్డుల తయారీలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. అంతేకాకుండా.. శ్రీవారికి చెందని ఏ అంశమైన జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. అదే విధంగా తిరుమలు వచ్చే ప్రతి భక్తుడి.. రెస్పాన్స్ తెలుసుకొవాలన్నారు.  ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న.. వెంటనే సాల్వ్ చేయాలన్నారు. ఒక్క తిరుమలలోనే కాక మిగతా ఆలయాల్లో కూడా భక్తుల అభిప్రాయం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించారు. 



వీఐపీ కల్చర్ పై సీఎం గరం గరం..


కొంత మంది టీటీడీ వాళ్లు వీఐపీ సేవల్లో తరిస్తున్నారని అనేక ఫిర్యాదులు వచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆలయంలో ఎక్కవగా వీఐపీ కల్చర్ అతిగా ప్రొత్సహించకూడదన్నారు. ఎవరైన ప్రముఖులు వస్తే.. అతిగా హాడావుడి కన్పించకూడదన్నారు. కేవలం ఆధ్యాత్మికత, కేవలం గోవింద నామస్మరణలే ప్రథమ కర్తవ్యంలా ఉండాలన్నారు. తిరుమలలో అనవసర ఖర్చులు తగ్గించుకొని, భక్తులకు కల్పించే సదుపాయాల మీద ఎక్కువగా టార్గెట్ చేయాలన్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ కల్చర్ పై చంద్రబాబు వ్యాఖ్యలు పట్ల భక్తులు మాత్రం స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది.


పెరిగిన నాణ్యత


తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత గత ప్రభుత్వ హాయంలో కన్నా.. ఇప్పుడు చాలా పెరిగిందన్నారు. ఇంకా కూడా సేవలు మెరుగా పడాలని చంద్రబాబు సూచించారు. భక్తుల పట్ల హుందాతనంగా వ్యవహరించాలన్నారు. ఎవరి పట్ల అగౌరవంగా, అమర్యాదగా ప్రవర్తించినట్లైతే కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. ఆలయ పవిత్రత కాపాడటం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని’ సీఎం చంద్రబాబు ఆదేశించారు.


Read more: Tirumala: ఒక్కరోజులోనే తిరుమల దర్శనం.. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల పూర్తి షెడ్యూల్ ఇదే..


అదే విధంగా.. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లకు ప్రణాళికతో పనిచేయాలి. బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల ఏంటని కూడా అధికారులను సీఎం చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు తిరుమలలో ఉన్న చంద్రబాబు  అత్యాధునిక వకుళా మాత సెంట్రలైజ్డ్ కిచెన్ ను ప్రారంభించారు.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.