Dates and Ghee Benefits: నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా

ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో సూపర్ ఫుడ్‌గా పరిగణించేవి నెయ్యి, ఖర్జూరం. ఈ రెండింటినీ కలిపి సేవిస్తే ఏమౌతుందనేది చాలామంది సందేహం ఉంటుంది. సాధారణంగా ఖర్జూరం పండ్లను నీళ్లలో కలిపి తీసుకుంటారు. కానీ నెయ్యిలో కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం.

Dates and Ghee Benefits: ప్రకృతిలో లభించే కొన్ని పదార్ధాల్లో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. ఇందులో సూపర్ ఫుడ్‌గా పరిగణించేవి నెయ్యి, ఖర్జూరం. ఈ రెండింటినీ కలిపి సేవిస్తే ఏమౌతుందనేది చాలామంది సందేహం ఉంటుంది. సాధారణంగా ఖర్జూరం పండ్లను నీళ్లలో కలిపి తీసుకుంటారు. కానీ నెయ్యిలో కలిపి తీసుకుంటే ఏమౌతుందో తెలుసుకుందాం.

1 /6

నెయ్యిలో హెల్తీ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యంగా ఉంచుతుంది

2 /6

నెయ్యి, ఖర్జూరం మిశ్రమం చర్మ సంరక్షణలో కీలకంగా ఉపయోగపడుతుంది. నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్, ఖర్జూరంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషకాలను అందిస్తాయి. చర్మానికి నిగారింపు అందిస్తుంది. 

3 /6

ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పెద్దఎత్తున ఉంటాయి. నెయ్యిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెండూ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది. సీజన్ మారినప్పుడు ఎదురయ్యే సమస్యలు తొలగిపోతాయి.

4 /6

ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. నెయ్యి కేటలిస్ట్‌గా పనిచేస్తుంది.

5 /6

మలబద్ధకం లేదా విరేచనాల సమస్య ఉంటే ఈ రెండూ కలిపి సేవిస్తే మంచి ఫలితాలుంటాయి. ఖర్డూరంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నెయ్యితో కలిపి సేవిస్తే కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి.

6 /6

వాస్తవానికి నెయ్యిలో ఖర్జూరం పండ్లు నానబెట్టి తినడం పాత పద్ధతే. ఆయుర్వేదంలో దీని ప్రస్తావన ఉంది. ఈ రెండూ కలిపి తినడం వల్ల మెటబోలిజం వేగవంతమౌతుంది. ఎముకలకు బలం చేకూరుతుంది. ఇంకా ఏ లాభాలున్నాయో తెలుసుకుందాం.