Nara Chandrababu Naidu:  దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో టీడీపీ నేతృత్వకంలోని కూటమి విజయ దుంధుబి మోగించింది. మరోసారి ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల్లో దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే కదా. తాజాగా వీరి విజయాన్నిఅభినందిస్తూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తి రేకిత్తించింది. గత కొన్నేళ్లుగా అంతగా పొసగడంలేదు. అది పలు విషయాల్లో స్ఫష్టమైంది. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు సతీమణి జూనియర్ మేనత్త అయిన భువనేశ్వరిని నిండు సభలో వైసీపీ నేతలు అనరాని మాటలన్నారు. దీన్ని ప్రతి ఒక్కరితో పాటు నందమూరి కుటుంబ సభ్యులు అందరు ఖండించారు. కానీ తారక్ మాత్రం ఆ విషయమై  మౌనం వహించడంతో అప్పట్లో తీవ్ర విమర్శల పాలయ్యాడు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ ఇలాంటి ఓ సందర్భంలో కుటుంబానికి ఎందుకు అండగా ఓ మాట మాట్లాడకుండా మౌనం వహించడంపై పెద్ద దుమారమే రేగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై కూడా అప్పట్లో ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. ఏదో ఒక పార్టీ అనుకూలంగా వ్యవహరించకూడదన్న తారక్ ప్రయత్నం ఈ సందర్భంలో బెడిసి  కొట్టింది. ఎన్టీఆర్ గొప్పవారే.. వైయస్ఆర్ గొప్పవారే అంటూ చేసిన కామెంట్స్ తెలుగు దేశం శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి.


ఈ నేపథ్యంలో ఏపీలో మరోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడుకు కాస్త ఆలస్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు అభినందనలు తెలియజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి చంద్రబాబు నాయుడు కూడా థాంక్యూ వెరీ మచ్ అమ్మ అంటూ కూల్ ఆన్సర్ ఇచ్చారు.




























అంతేకాదు తెలుగు దేశం పార్టీ ఏపీలో అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఒక్కొక్కరిగా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసారు. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, రామ్ పోతినేని, రామ్ చరణ్, మంజు మనోజ్, మోహన్ బాబు, కుష్బూ సుందర్ తో పాటు పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు. వారందరికీ పేరు పేరునా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసారు.


Also read: Richest MP List: దేశంలోనే అత్యంత ధనిక ఎంపీగా గుంటూరు టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, టాప్ 6 జాబితా ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook