AP E Cabinet Meet: అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల నాయకులతోపాటు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిపై వేధింపులకు పాల్పడుతుండడంతో తీవ్ర విమర్శలు వ్యతిరేకమవుతున్నాయి. తమపై వ్యతిరేకత చూపిస్తున్న ప్రజలపై దాడులకు కూడా వెనుకాడడం లేదు. ఈ విషయాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 'మీ వలన పరువు పోతుంది' అని మండిపడ్డారు. తీరు మార్చుకోవాలని హితవు పలికారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడు బిగిస్తారా సీఎం గారు? చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం


 


ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం సరికొత్తగా కొనసాగింది. ఈ కేబినెట్‌ నిర్వహించారు. ఈ మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలపై ఆరా తీయగా.. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేల వ్యవహార శైలి సక్రమంగా లేదని చంద్రబాబు గుర్తించారు. వారి పేర్లు ప్రస్తావించకుండా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Chandrababu Shock: చంద్రబాబు పర్యటనలో కలకలం.. అడ్డగించిన మాల సంఘాలు


'ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రవర్తనతో ఇన్నాళ్లు నిర్మించుకున్న మంచి పేరు దెబ్బతింటోంది. పేపర్ల నిండా వాళ్లు చేస్తున్న పొరపాట్లను ప్రస్తావిస్తూ వార్తలు వస్తున్నాయి. దీనివల్ల అందరికీ చెడ్డ పేరు వస్తోంది. మంత్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ పార్లమెంట్, జిల్లాలోని ఎమ్మెల్యేలు, నాయకులను మీరే గైడ్ చేయాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మంత్రులది, ఎమ్మెల్యేలది' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook