సులభతర వాణిజ్యంలో ఏపీ అగ్రస్థానంలో నిలవడంపై ఏపీ సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ  ఇది ఏపీ అభివృద్దికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సమష్టి కృషితోనే ఇది సాధ్యపడిందన్నారు. ఏపీ అగ్రస్థానంలో నిలవడం వెనుక అధికారుల కృషి ఎంతో ఉందని చంద్రబాబు మెచ్చుకున్నారు.  టీడీపీ పరిపాలన మెరుగ్గా ఉందనడానికి తాజా పరిణమామమే నిదర్శనమని చంద్రబాబు ట్వీట్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఈవోడీబీ  ర్యాంకులు ప్రకటన సమయంలో  సీఎం చంద్రబాబు సింగపూర్‌ పర్యటనలో ఉన్నారు .ఇందులో ఏపీ తొలి స్థానంలో నిలవగా..తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడాన్ని ప్రశంసిస్తూ  తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించగా... రెండో ర్యాంకులో నిలవడంపై నారా లోకేష్ కూడా కేసీఆర్ ప్రభుత్వానికి విష్ చేశారు.