Dandruff: చుండ్రు తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు.. ఇంతకంటే ఎఫెక్టివ్ రెమిడీనే లేదు..

Anti Dandruff Home Tips: చుండ్రు అంటే కుదుళ్లు పొడిబారినప్పుడు డ్రై గా మారిపోతుంది. దీంతో ఆ ప్రాంతంలో పొట్టు పొట్టు రాలిపోతుంది.. కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. హెయిర్ ఫాల్ కూడా విపరీతంగా ఉంటుంది. అయితే, ఈ చుండ్రు సమస్య త్వరగా తగ్గిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Dec 1, 2024, 05:19 PM IST
Dandruff: చుండ్రు తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు.. ఇంతకంటే ఎఫెక్టివ్ రెమిడీనే లేదు..

Anti Dandruff Home Tips: చుండ్రు తగ్గించుకోవడానికి రకరకాల చిట్కాలు ప్రయత్నిస్తారు. ఎన్నో వేలు ఖర్చుపెట్టి ఎన్నో ఉత్పత్తులను ఉపయోగిస్తారు. అయినా కానీ డాండ్రఫ్ తగ్గిపోదు అయితే కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటిస్తూ సులభంగా తగ్గించుకోవచ్చు... అంటే చర్మం పొడిబారిపోతుంది. కుదుళ్లు పొడిబారకుండా జాగ్రత్తలు వహించాలి.

డాండ్రఫ్‌ పేరుకున్నప్పుడు కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.. దీంతో హెయిర్ పెరుగుదల ఉండదు. దీనికి యాపిల్ సైడర్ వెనిగర్ ఒక రెమిడీ. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అంతే కాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి... కొద్దిగా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని నీటిలో కలిపి షాంపూతో పాటు హెయిర్ కి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు త్వరగా వదిలిపోతుంది.

టీ ట్రీ ఆయిల్..
టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చుండ్రు సమస్యకు ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్‌ కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లో మిక్స్‌ చేసే తలకు మసాజ్ చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది.

వేపాకులతో కూడా చుండ్రుకు చెక్ పెట్టొచ్చు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయని మనకు తెలిసిందే. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉండటం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. వేప ఆకులను తీసుకువచ్చి వాటిని బాగా ఉడకబెట్టి ఆ నీటిని జుట్టుకు అప్లై చేయాలి. ఆ నీటితో తలస్నానం చేయడం వల్ల చుండ్రు తొలగిపోతుంది. అంతేకాదు వేపాకు నీటిని హెయిర్ స్ప్రేగా తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు.. తలస్నానం చేసే ముందు జుట్టుకు స్ప్రే చేసుకుంటూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

ఇదీ చదవండి: Mosquitoes: చలి వేళ దోమల గోల.. ఈ మొక్కతో ఆమాడ దూరం పరార్‌..

ఆలివ్ ఆయిల్ తో కూడా చుండ్రు సమస్య తగ్గిపోతుంది. ఎందుకంటే ఇందులో మాయిశ్చర్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.. కుదుళ్లు పొడిబారకుండా కాపాడుతుంది. రాత్రి సమయంలో ఆలివ్ ఆయిల్ లో జుట్టు అంతటికీ అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి... ఆ తర్వాత అలాగే వదిలేసి ఉదయం తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మానికి చెక్ పెట్టవచ్చు.  చుండ్రు కూడా తగ్గిపోతుంది.

ఆముదం నూనెలో కూడా యాంటీమైక్రోబ్రియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కుదుళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది. వారంలో ఒకసారి ఈ ఆముదం నూనె జుట్టుకు అప్లై చేయడం వల్ల చుండ్రు సమస్యకు చెక్ పెట్టవచ్చు... ఇది కుదుళ్ళను పొడి పొడిబారకుండా కాపాడుతుంది. మీరు వాడే కొబ్బరి నూనె లేదా ఇతర ఆయిల్స్ లో ఆముదం నూనె కలిపి జుట్టు అంతటికీ అప్లై చేయండి.

ఇదీ చదవండి:  ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..

కలబందలో కూడా నయం చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం పై వచ్చే దురదలను తొలగిస్తుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఎఫెక్టీవ్‌ రెమిడీ. కలబంద ఉపయోగించడం వల్ల కుదుళ్లు మాయిశ్చర్‌ కోల్పోకుండా ఉంటాయి... కొన్ని నివేదికల ప్రకారం కలబందలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యకు తక్షణ రెమెడీగా పనిచేస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News