నేడు ఆంధ్రప్రదేశ్ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదలకానున్నాయి. రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నంలోని ఏయూ కాన్వొకేషన్‌ హాల్‌లో ఫలితాలను విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సాధారణంగా టెన్త్ ఫలితాలను మేలో విడుదల చేసేవారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ చివర్లో విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 15 నుండి మార్చి 29 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన టెన్త్ పరీక్షలకు ఐదు లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విద్యార్థులు 2018 టెన్త్ ఫలితాలను results.nic.in, examresults.net, manabadi.co.inతో పాటు అధికారిక వెబ్‌సైట్ bseap.org/bse.ap.gov.in, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్(bit.ly/2E1cdN7), ఏపీ ఫైబర్-టీవీ, ఏపీ సీఎం కనెక్ట్(కైజలా మొబైల్ యాప్-aka.ms/apresult), ఆర్‌టీజీఎస్ పోర్టల్(rtgs.ap.gov.in)లలో కూడా చూసుకోవచ్చు.


10వ తరగతి పరిక్షల ఫలితాలను ఇలా చూసుకోవచ్చు:


  • అధికారిక వెబ్‌సైట్ bseap.org లేదా bse.ap.gov.inకు వెళ్లండి.

  • హోంపేజీలో ఆంధ్ర ప్రదేశ్ ఏపీ ఎస్ఎస్‌సీ క్లాస్ టెన్త్ 2018 ఫలితాలు లింక్ మీద క్లిక్ చేయండి.  

  • రోల్ నెంబర్, పేరు తదితర వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.

  • ఫలితాలను చూసుకొని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.


మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా:


ఎస్ఎస్సీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రోల్ నెంబర్‌ను టైప్ చేసి(SSC<space>ROLL NUMBER) 56263కి ఎస్ఎంఎస్ పంపించి కూడా మీ ఫలితాలను తెలుసుకోవచ్చు.