Chicken biryani for 2 rupees in tadepalligudem west Godavari video goes viral: కొందరు జనాలు ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయిన తాగుతుంటారు. ఇటీవల కాలంలో మార్కెట్ లో ఏది ముట్టుకున్న కూడా మండిపోతుంది. నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు ఏది తక్కువ ధరకు వస్తుందని మార్కెటలో తెగ వెతుకుతున్నారు. మరోవైపు కేవలం ఆఫర్ లో కోసమే చాలా మంది సామాజిక మాధ్యమాలలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో.. కొంత మంది మాత్రం మరీ దిగాజారీ ప్రవర్తిస్తుంటారు. సంతలో చివరకు పడేసిన కూరగాయల్ని సైతం అస్సలు వదిలిపెట్టరు.  ఇటీవల కాలంలో రోడ్లమీద ఆయిల్ ట్యాంక్ లు, కూరగాయల ట్రక్ లు, పాలట్యాంకర్ లు, చెపలతో వెళ్తున్న భారీ ట్రక్ లు బోల్తా పడ్డాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఈ ఘటనల్లో కొన్నిచోట్ల డ్రైవర్ లు తీవ్రంగా గాయపడగా.. మరికొన్ని చోట్ల మాత్రం.. డ్రైవర్ లు ప్రాణాలు వదలిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఈ సంఘనలన్నింటిలో ట్విస్ట్ ఏంటంటే.. చాలా చోట్ల జనాలు, ఎగబడి మరీ కోళ్లను, పాలను, ఆయిల్ ను, బకెట్ లలో తమ ఇంటికి తీసుకుని పారిపోయారు. ప్రమాదంలో పడిపోయిన డ్రైవర్ ఉన్నాడా.. పోయాడా.. అన్నదానిపై చాలా మంది జనాలు అస్సలు పట్టించుకోరు. ఈ క్రమంలో కొత్తగా షాపులు ఎక్కడైన ఇనాగ్రేషన్ చేసిన రోజు ఆఫర్లు ఇస్తుంటారు. కేవలం కొద్ది మందికే.. కొన్ని గంటల పాటు మాత్రమే ఆ ఆఫర్ లు ఉంటాయి. కానీ జనాలు మాత్రం ఫ్రీ, ఆఫర్ అనగానే ఎగబడి మరీ వస్తుంటారు. దీంతో తొక్కిసలాట జరుగుతుంటాయి.ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..


పశ్చిమ గోదావరిలో జిల్లా తాడేపల్లి గూడెంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఉషా గ్రాండ్ వద్ద రెస్టారెంట్ ను కొత్తగా ప్రారంభించారు. అక్కడ రెండు రూపాయలకే చికెన్ బిర్యానీ అని ఆఫర్ ప్రకటించారు. దీంతో వేలాదిగా జనాలు పొటెత్తారు. దీంతో నిర్వాహకులు వారిని కంట్రోల్ చేయలేక  చేతులెత్తేశారు. అక్కడ రోడ్డుమీద పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది.  ఒకరిపై మరోకరు పడి వాగ్వాదానికి సైతం దిగారు.


Read more: Nagachaitanya Engagement: సామ్ ప్రపోజ్ చేసిన రోజే.. చైతు ఎంగేజ్ మెంట్.. పర్ఫేక్ట్ రీవెంజ్ అంటూ  సోషల్ మీడియాలో రచ్చ..


ఈ నేపథ్యంలో.. ఏకంగా పోలీసులు ఎంట్రీఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మొదటగా వచ్చిన ఒక 200 మందికే మాత్రమే 2 రూపాయల చికెన్ బిర్యానీ ఇస్తున్నారంట. ఇది తెలయనీ జనాలు వేలల్లో పొటేత్తారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి