Megastar Chiranjeevi: తిరుపతి, తిరుమలలో భారీ వర్షాలు(Heavy Rains) బీభత్సం సృష్టిస్తున్నాయి, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్పందించారు. వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని ఆయన తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం చిరు ఓ ట్వీట్‌(Tweet) చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను''’ అని ఆయన పేర్కొన్నారు. 



Also Read: శ్రీవారి ఆలయానికి పోటెత్తిన వరద...మెట్ల మార్గాలను మూసేసిన తితిదే...


కుండపోత వానలతో తిరుపతి(Tirupat) వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎడతెరిపిలేని వానలతో శేషాచలం కొండలు..జలపాతాలను తలపిస్తున్నాయి. కపిలతీర్థం, మాల్వాడి గుండం నుంచి వరద నీరు ఉరకలేస్తోంది. శ్రీవారి ఆలయానికి వరద నీరు పోటెత్తింది. తిరుమల(Tirumala) మాడవీధులు జలమయమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో..మెట్లమార్గాన్ని తితిదే(TTD) అధికారులు మూసేశారు. పద్మావతి విశ్వవిద్యాలయం (Padmavati University) లోని ఇంజినీరింగ్ కళాశాలలోకి వరద నీరు చేరింది. 


భారీ చెట్లు నేలకూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం(power supply stoped) ఏర్పడింది. నగరంలోని రెండు రైల్వే మార్గాల వంతెనల కింద రాకపోకలను నిలిపివేశారు. రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.  తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి(Tirupati Government Maternity Hospital) లో వైద్య సేవలు నిలిచిపోయాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook