Chiranjeevi Emotional About Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో.. లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి పట్టం కట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో సంచలన తీర్పునిచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో కూటమిలో కీలక భూమిక పోషించిన జనసేన పార్టీ తనకు కేటాయించిన అన్ని స్థానాల్లోనూ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన సోదరుడు, సినీ నటుడు చిరంజీవి ఆనందంలో మునిగాడు. తన తమ్ముడి అఖండ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌పై మెగాస్టార్‌ భావోద్వేగానికి లోనయ్యారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Pithapuram: పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత.. పవన్‌ కల్యాణ్‌ అనే నేను


'ఎక్స్‌' వేదికగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. తన పోస్టులో తమ్ముడిపై ప్రశంసలు కురిపించారు. తన హృదయం ఉప్పొంగుతోందని తెలిపారు. కూటమి అత్యాద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల చిరు హర్షం వ్యక్తం చేశారు. ఇది కొత్త అధ్యాయమని.. మరింత విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విటర్‌లో చిరంజీవి చేసిన పోస్టు వైరల్‌గా మారింది.

Also Read: AP Election Results: జగన్‌ దారుణ ఓటమికి కారణాలు ఇవే.. అవే చావుదెబ్బ తీశాయా?


'ప్రియమైన కల్యాణ్‌ బాబు ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించడానికే అని నిరూపించినా. నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్‌ చేంజర్‌వి మాత్రమే కాదు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది! నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన  ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ  కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని  నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ.. ఆశీర్వదిస్తూ శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో  నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా' అని చిరంజీవి పోస్టు చేశారు.


చంద్రబాబుపై ప్రశంసలు
అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా చిరంజీవి ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో అరుదైన విజయాన్ని పొందారని కొనియాడారు. ఈ  మహత్తర విజయం మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు నిదర్శనమని తెలిపారు. ఏపీకి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనమని పేర్కొన్నారు. రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడీన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నట్లు అని చిరంజీవి తెలిపారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter