Chiranjeevi supports AP CM YS Jagan : జగన్‌కి జై కొట్టి.. పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాజధానుల అంశంపై చిరంజీవి మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యం అని అన్నారు. రాష్ట్ర సర్వతో ముఖాభివృధికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్దంగా కృషి చేస్తారన్న నమ్మకం ఉందని సీఎం జగన్‌పై చిరంజీవి విశ్వాసం వ్యక్తంచేశారు. అమరావతి - శాసన నిర్వాహక, విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూల్ - న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలని చిరంజీవి వ్యాఖ్యానించారు.
Read also : 3 Capitals for AP : రాజధాని మూడు ముక్కలాట వెనుక వైసిపి ఇన్‌సైడ్ ట్రేడింగ్: జనసేన
జీఎన్ రావు కమిటీ నివేదికపై చిరంజీవి ఏమన్నారంటే.. ఏపీలో వివిధ ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫార్సులు సామాజిక, ఆర్ధిక అసమానతలు తొలగించేవిగా ఉన్నాయి. గత అభివృద్ధి, పాలన అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో మిగితా ప్రాంతాలు నిర్లక్ష్యం కావడం వల్లే ఆర్దిక, సామాజిక సమతుల్యాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఇంకో లక్షకోట్లు అప్పుతో అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్ధితి ఏమిటన్న ఆందోళన అందరిలో ఉందని చిరంజీవి అభిప్రాయపడ్డారు.
Read also : మూడు రాజధానుల ప్రతిపాదన అందుకే: చంద్రబాబు
మరి అమరావతి రైతుల పరిస్థితేంటి ?..
సాగు, తాగు నీరు, ఉపాధి అవకాశాలు లేక ఊర్లు విడిచిపోతున్న వలుస కూలీల బిడ్డల భవిష్యత్‌కు, నిరుద్యోగులకు మూడు రాజధానుల కాన్సెప్ట్ భద్రతనిస్తుందని చిరంజీవి పేర్కొన్నారు. అయితే, అదే సమయంలో రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులలో నెలకొన్న భయాందోళనలు, అభద్రతాభావాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. వాళ్లు నష్టపోకుండా, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపోహలు, అపార్దాలు నివారించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి అని చిరంజీవి తెలిపారు.