Vijayawada Floods: ఆంధ్రప్రదేశ్‌లో వరదల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగు రోజులుగా సహాయ చర్యల్లో మునిగారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న విజయవాడను కాపాడేందుకు పగలు, రాత్రి ఆయన శ్రమిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన తన ఇంటికి వెళ్లకుండా కలెక్టరేట్‌లోనే ఉంటూ.. బస్సులో నిద్రపోతూ ప్రజల కోసం కష్టపడుతున్నారు. వరుసగా నాలుగో రోజు బుధవారం ఉదయం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమై సహాయ చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: వరద కష్టాలకు చలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్.. పార్టీ తరఫున భారీ విరాళం


విజయవాడలో సాధారణ స్థితి వచ్చేవరకు కలెక్టరేట్‍లోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. 'ప్రజలు ఇంటి నుంచి బయటకు సరదాగా వచ్చి వెళ్లే వరకు నా ఇల్లు కలెక్టర్ కార్యాలయమే!' అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సహాయ చర్యలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరింత కష్టపడి బాధితులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల శుభ్రతపై దృష్టి సారించాలని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

Also Read: YS Sharmila: 'ఇద్దరు బిడ్డలు ఉన్న జగన్‌ ఇంత నీచానికి పాల్పడతారా? వైఎస్‌ షర్మిల ఆగ్రహం


'వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టి సాధారణ స్థితికి తీసుకొస్తున్నాం. ప్రతి ఇంటికి సహాయం అందించాలి. వరదల్లో చనిపోయిన వారిని గుర్తించి వారి కుటుంబాల వారికి అప్పగించాలి. వరూ ముందుకు రాకపోతే ప్రభుత్వం తరఫున గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించాలి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహార అందించాలి. వరద తగ్గుముఖం పట్టడంతో ఆహారం గడప గడపకు వెళ్లే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, 2 కిలోలలు ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళదుంప, కిలో చక్కెర అందించాలి' అని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.


మొబైల్ రైతు బజార్లు ఏర్పాటు చేసి బ్లాక్ మార్కెటింగ్ లేకుండా అతి తక్కువ ధరకు కూరగాయలు విక్రయించేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు చెప్పారు. 'నష్టాన్ని వివరించి కేంద్ర సాయం కోరదాం. ఆహారం, నీరు, బిస్కెట్స్, పాలు, అరటిపండ్లు అన్నీ డోర్ టు డోర్ అందాలి. అన్ని అంబులెన్స్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచం. విద్యుత్ పునరుద్ధరణ వేగవంతం చేయాలి. శానిటేషన్ పనులు ఒక యుద్దంలా జరగాలి. ప్రతి ఇంటిని శుభ్రం చేసేప్పుడు ఇంటికి సంబంధించిన వారిని భాగస్వామ్యులను చేయండి' అని చంద్రబాబు సూచనలు చేశారు.


వైరల్ ఫీవర్లు, దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలకు జాగ్రత్తలు చెప్పాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'ప్రతి సచివాలయంలో ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలి. ఎవరికి ఏ మందులు కావాలన్నా అందించాలి. పంట నష్టంపై అంచనాలు నమోదు చేయండి' అంటూ ఆదేశాలు జారీ చేశారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter