SC Sub Category: అభివృద్ధికి దూరంగా ఉన్న దళిత సామాజిక వర్గానికి అన్ని రకాలుగా అవకాశాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేసి అణగారిన వర్గాలకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికీ అన్యాయం చేయకుండా ఒక యూనిట్‌గా వర్గీకరణ అమలు చేస్తామని తెలిపారు. సామాజిక రుగ్మతలు లేకుండా చేస్తానని దళిత వర్గానికి భరోసా ఇచ్చారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Sharmila: వర్రా రవీంద్రా రెడ్డి అనే సైకో నా పుట్టుకను అవమానించాడు: వైఎస్‌ షర్మిల


ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా దళితుల విషయమై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే దళిత ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబుతో దళిత ఎమ్మెల్యేలు భేటీ అయ్యి తమ సామాజిక అంశాలపై చర్చడించడంతోపాటు ఎస్సీ వర్గీకరణపై కీలక చర్చ జరిగింది. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ది, వ్యాపార అవకాశాలు కల్పించడం ద్వారా సమగ్ర దళితాభివృద్ది చెందుతారని సీఎం చంద్రబాబు తెలిపారు.

Also Read: YS Jagan: ఏపీలో మరో ఎన్నిక.. గెలుపు గుర్రాన్ని ప్రకటించిన మాజీ సీఎం జగన్


 


వర్గీకరణ అమలుతో దళిత ఉప కులాలకు దామాషా ప్రకారం సమాన అవకాశాలు కల్పించి ఊతమిచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం గుర్తుచేశారు. తెలుగుదేశం దళితులకు మొదటి నుంచీ అండగా ఉందని చెప్పారు. జస్టిస్ పున్నయ్య కమిషన్‌తో అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత రావడంతో దానికి అవసరమైన కార్యాచరణ అమలు చేయడానికి సిద్ధమైనట్లు దళిత ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వివరించారు. 


దళిత వర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయాల్సి ఉందని.. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్దితో పాటు వ్యాపార అవకాశాలు కల్పించడంతో దళిత జాతి సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2014లో బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్‌తోపాటు అనేక కార్యక్రమాలు అమలుచేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుచేశారు.


ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనను సీఎం చంద్రబాబుతోపాటు దళిత ఎమ్మెల్యేలు చర్చించారు. దళిత వాడల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదని.. ఒక్క మరుగుదొడ్డు కట్టలేదని ఎమ్మెల్యేలు చెప్పారు. దళిత కుటుంబాల్లో పెద్ద ఎత్తున మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన విషయాన్ని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. ఐదేళ్లలో దళిత జాతి తీవ్ర అణచివేతకు, వివక్షకు గురయ్యిందని వాపోయారు. దళితులు కౌలు రైతులుగా సాగు చేస్తున్నారని.. వారికి ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యేలు కోరారు. 


వచ్చే ఐదేళ్లలో దళిత వర్గాన్ని నిలబెట్టేందుకు ఏం చేయాలి? వారి సమగ్ర అభివృద్దికి ఎలాంటి విధానాలు అమలు చేయాలనే విషయంపై ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. మొన్నటి ఎన్నికల్లో 29 ఎస్సీ సీట్లకు గాను 27 నియోజకవర్గాల్లో ప్రజలు గెలిపించారని సీఎం గుర్తు చేశారు. దళిత జాతి అభివృద్ధికి పనిచేసి 2029లో ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటానన్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.