Chandrababu ChitChat: 'నాయకులు లేదా అధికారులు ఎవరూ తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది' అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 'నేను జైలు నుంచి విడుదలయ్యాక కొంతమందికి కక్ష తీర్చుకుంటానని అన్నారు. నిజమే! నేను రాజకీయ కక్ష తీర్చుకోను. ఎందుకంటే తప్పు చేసిన వారిని వదిలిపెట్టను' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనలో 1995 నాటి ముఖ్యమంత్రిని త్వరలో మీరే చూస్తారని ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగానికి బిగ్‌ బూస్ట్‌.. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు


మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. '1995 నాటి ముఖ్యమంత్రిని మళ్లీ చూస్తారు. ఇది ప్రారంభమై సోషల్ మీడియాకు మీరు చూశారు కదా! మిగతా కేసులు కూడా అలానే డీల్ చేస్తా' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'కేడర్ ఉద్దేశం ఒకలాగా ఉంది నా లక్ష్యం వేరుగా ఉంది. ఎందుకంటే నేను అందరి అభిప్రాయాలు తీసుకోవాలి. అవతలి వాళ్లు చేసినట్టు నేను చేయను. చట్ట ప్రకారం చేస్తా. ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు' అని హెచ్చరించారు. 


Also Read: Chandrababu: ఏపీ కరువు రహిత రాష్ట్రం కోసం సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం


ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'ఎమ్మెల్యేలను పిలిచి అందరితో మాట్లాడుతున్నా. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ గెలిచేట్టు ఉండాలి' అని ఆదేశించినట్లు తెలిపారు. '2004లో నన్ను ఎవరూ ఓడించలేదు' అని పేర్కొన్నారు. 'హైదరాబాద్‍ను ఎప్పుడూలేని విధంగా అభివృద్ధి చేశా. కానీ ప్రజలకు నేను చెప్పుకోలేకపోయా' అని వివరించారు. అధికారులను కూడా ఐదేళ్లు బురద గుంటలోకి తోసేశారని ఆసక్తికర ప్రకటన చేశారు. 


 


'కొందరు అధికారులు జగన్ మాటలు విని పనిచేశారు. సమాజానికి హాని కలిగించే ఎవరినీ నేను వదలను' అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 'మా ఎమ్మెల్యేలు అందరికీ కౌన్సిలింగ్ మొదలుపెట్టా. ఎమ్మెల్యేలకు తప్పులు చేయవద్దని పదేపదే హెచ్చరిస్తున్నా. వైఎస్‌ జగన్‌లాగా మేం తప్పులు చేస్తే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. నాకు నా ప్రజలే హైకమాండ్' అని ప్రకటించారు. '1995లో జగన్‌లాంటి వ్యక్తులు రాజకీయాల్లో లేరు' అని చెప్పారు. ప్రజల ఆకాంక్షలు పెరిగాయన్నారు. 'అన్నీ రాత్రికి రాత్రే జరిగిపోవాలి అంటే సాధ్యం కాదనేది అందరూ గమనించాలి' అంటూ అభివృద్ధి, హామీలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 'తొలిసారి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీకి అవకాశం ఇచ్చా. మా పార్టీ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి పదవులను కూడా బీసీలకు నేను మాత్రమే ఇచ్చా' అని సీఎం చంద్రబాబు చెప్పుకున్నారు. 'సోషల్ రీ ఇంజనీరింగ్ నేను చేస్తున్నా. చీఫ్ సెక్రటరీకి సామర్థ్యం, బీసీ రెండూ విజయానంద్‍కు అర్హతలు' అని తెలిపారు.


వైసీపీ నాయకుల చేరికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవారు రాజకీయ అవసరాల కోసమే పార్టీలు మారుతున్నారు. వైసీపీ నేతల చేరికల అంశం ఈ మూడు పార్టీలలో చర్చ జరుగుతోంది. సంకీర్ణం ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి. అన్ని విషయాలు మాట్లాడుకుంటాం' అని చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.