ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. అమరావతి, తిరుపతి, అనంతపురం ప్రాంతాల్లోనే కాకుండా వైజాగ్ కేంద్రంగా కూడా సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేసేలా.. ఇప్పటికే పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే డిజిటల్ ఇండియా ప్రేరణతో రాష్ట్ర కార్యాలయాలతో పాటు గ్రామకార్యాలయాల్లో కూడా పేపర్ లెస్ అడ్మినిస్ట్రేషన్‌కు పెద్దపీట వేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. తిరుపతి ప్రాంతంలోని జోహో ఐటి పరిశ్రమను ప్రారంభించిన ఆయన ప్రసంగంలోని పలు ముఖ్యమైన విషయాలు


*తిరుపతి కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. అది ఎందరో మేధావులకు నిలయంగా మారాలి. దానిని నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాల్సి ఉంది.


*2019 నాటికి ఐటి రంగంలో రాష్ట్ర యువతకు దాదాపు లక్ష ఉద్యోగాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం


*హైదరాబాద్‌కు మైక్రోసాప్ట్ ఎలాగో.. తిరుపతికి జోహో పరిశ్రమ అలా కావాలి. 


*2018నాటికి దాదాపు కోటిమంది యువతను సాంకేతికంగా ఎక్స్‌పర్ట్స్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను రూపొందించి... దాదాపు 250 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి సర్కారు సంకల్పిస్తుంది


*ప్రస్తుతం కంప్యూటర్ ఆధారిత పరిశ్రమలకు ఆనవాలం సిలికాన్ వ్యాలీ అని అంటున్నారు. రేపు ఆంధ్రావ్యాలీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటిరంగానికి దిక్సూచి అని చెప్పుకోవాలి. ఆ దిశగా వెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం