Interest Free Loans in AP: మహిళా సాధికారిత లక్ష్యంగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ సర్కారు.. తాజాగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు గుడ్‌న్యూస్ అందించింది. సొంత కాళ్లపై నిలబడాలనుకునే మహిళలు ఆర్థికంగా అండగా నిలబడేందుకు మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించింది. ఈ పథకంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళలు కేవలం 10 శాతం ఖర్చుతో ఆటోలు సమకూర్చుకోవచ్చు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) పరిధిలో 'ఉన్నతి' కార్యక్రమంలో ఇంట్రెస్ట్ లేకుండా లోన్లు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయం సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టి వెళ్లడంతో అద్దెవి కాకుండా.. సొంతంగా నడుపుకుని వారు మరింత ఆదాయం పొందేలా చూడాలని భావించారు. అధికారులతో కలిసి మహిళా శక్తి అనే పథకాన్ని రూపొంంచారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఆటో ఖర్చులో పది శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90 శాతం సెర్ప్ ద్వారా ప్రభుత్వమే లోన్‌గా అందజేస్తుంది. ఈ 90 శాతంపై ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో మహిళలు సొంతంగా ఆటోలతో మరింత ఆదాయం పొంది.. ఆర్థికంగా బలోపేతం అవుతారని సీఎం జగన్ ఆలోచన. 


ఈ ఆర్థిక సంవత్సరంలో మండలానికి ఒకరికి చొప్పున మొత్తం 660 మందికి మహిళా శక్తి స్కీమ్‌ కింద ప్రభుత్వం చేయూతను అందివ్వనుంది. ఈ పథకానికి సంబంధించి పని మొదలుపెట్టిన అధికారులు.. ఇప్పటికే 229 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశారు. వారికి డ్రైవింగ్‌లో 4 రోజులపాటు అదనపు శిక్షణ కూడా ఇచ్చారు. డ్రైవింగ్‌లో మెళకువలతోపాటు ఆటోలకు సాధారణంగా వచ్చే చిన్న చిన్న సమస్యల విషయంలో జాగ్రత్తలను లబ్ధిదారులకు వివరించారు. 


ప్రస్తుతం మార్కెట్‌లో ఆటోల కొనుగోలుకు రుణాల కోసం బ్యాంకులను లేదా ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోంది. బ్యాంకులలో కొంచెం వడ్డీ తక్కువ ఉన్నా.. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం వడ్డీలు ఎక్కువగా ఉంటాయి. ఈ లోన్‌ను ప్రతి నెలా ఈఎంఐ రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ఆటోపై మొత్తం చెల్లించేలోపు వడ్డీనే రూ.లక్షన్నర వరకు అవుతోంది. ఇది ఆటో డ్రైవర్లకు పెను భారంగా మారుతోంది. తప్పనిపరిస్థితుల్లో రుణాల కోసం ఆశ్రయించాల్సి వస్తోంది. మహిళా శక్తి స్కీమ్‌ ద్వారా వడ్డీ లేకుండా ఆటోలను పొందే అవకాశం ఉండడంతో ఒక్కొక్కరికి రూ.లక్షన్నర వరకు వడ్డీ రూపంలో ఆదా అవుతుంది. ఈ స్కీమ్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు అంటున్నారు. 


Also Read: Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!  


Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook