Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!

Samsung Galaxy A25 5G Price: త్వరలోనే సాంసంగ్ కంపెనీ నుంచి మరో స్మార్ట్ ఫోన్ విడుదల కాబోతోంది ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరలోనే ఆధునిక ఫీచర్స్ మార్కెట్లో అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2023, 12:46 PM IST
Samsung Galaxy A25 5G Price: దీపావళి సందర్భంగా సాంసంగ్ గుడ్ న్యూస్‌..మార్కెట్‌లోకి మరో డ్రాప్ నాచ్‌ 5G మొబైల్‌!

Samsung Galaxy A25 5G Price: దీపావళి రోజు సాంసంగ్ తన కస్టమర్స్ కి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి మరో 5జి స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మొబైల్ ఇంతకుముందు విడుదల చేసిన A సిరీస్ కు సక్సెర్ గా తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy A25 5G పేరుతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ మొబైల్ ఫోన్ కు సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో.. ధర అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Samsung Galaxy A25 5G స్మార్ట్ ఫోన్ విడుదల ఇతర సంబంధిత వివరాలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్ FCC సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన అన్ని వివరాలు MySmartPrice అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. BIS ఇండియా వెబ్‌సైట్‌లో SM-A256E/DSN మోడల్ నంబర్‌తో వస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా FCC జాబితా ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది.

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్‌లు:
ఇటీవలి Geekbench జాబితా ప్రకారం.. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కాబోయే Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ మొదట 8GB RAM వేరియంట్ లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఫోన్ ఆక్టా-కోర్ Exynos 1280 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారంగా OneUIలో రన్ అవుతుంది. ఈ మొబైల్ గీక్‌బెంచ్ ప్లాట్‌ఫారమ్‌లో సింగిల్-కోర్, మల్టీ-కోర్ పరీక్షలలో వరుసగా 937, 2106 పాయింట్ల స్కోర్ ను సాధించింది. Galaxy A25 5G 6.44 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ సెల్ఫీకెమెరా కోసం ఫోన్వాటర్-డ్రాప్ నాచ్‌తో వస్తుంది.

ఇతర ఫీచర్స్‌:
50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా
 13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
8GB RAM వేరియంట్
6.44 అంగుళాల డిస్ప్లే
ఫోన్వాటర్-డ్రాప్ నాచ్‌

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x