CM Jagan Review Meeting on Rains: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ పునరావాసం కార్యక్రమాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందన్నారు. ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రమవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారని చెప్పారు. గత ఏడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చూశామని.. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలి. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలి. ఒక్కరూపాయి అదనంగా ఖర్చు చేసినా.. బాధితులకు అండగా ఉండాలి. కలెక్టర్లు మాకు మంచి చేశారు అన్న మాటే వినిపించాలి. అధికారులు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇప్పటికే ఖాళీలు చేశారు. అవసరం అనుకుంటే.. పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. సహాయశిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో అధికారులు ఉంటే.. ఎలాంటి సదుపాయాలు కావాలనుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కూడా కల్పించాలి.


సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు ఇవ్వండి. వ్యక్తులైతే వారికి రూ.1000 ఇవ్వండి. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ దృక్పథంతో ఉండాలి. ఆయా ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని తిరిగి పంపించేటప్పుడు వారికి రూ.10 వేల రూపాయలు ఇవ్వాలి. తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా..? లేక పూర్తిగా దెబ్బతిందా..? అన్న వర్గీకరణ వద్దు. వాళ్లు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు వర్గీకరణ అనవసరం.
అలాంటి వారికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తే.. తిరిగి ఆ కచ్చా ఇంటిని మరమ్మతు చేసుకోవడానికి, తిరిగి కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. 


అలాగే ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరద నీరు ప్రవహించిన ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్‌, కేజీ కందిపప్పు ఇవ్వాలి. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలి. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయండి.." అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. 


సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పారు. ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటివాటిని సిద్ధం చేసుకోవాలన్నారు. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు ఆయా గ్రామాల్లో ముమ్మరంగా చేపట్టాలని.. అలాగే ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. 


Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  


Also Read: Kishan Reddy: ట్యాంక్‌బండ్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్నారుగా.. ఏమైంది కేసీఆర్..?: కిషన్ రెడ్డి   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి