Kishan Reddy: ట్యాంక్‌బండ్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్నారుగా.. ఏమైంది కేసీఆర్..?: కిషన్ రెడ్డి

Kishan Reddy Visits Amberpet: వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు అంబర్‌పేట నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు అందుబాటులో ఉండి.. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 28, 2023, 02:59 PM IST
Kishan Reddy: ట్యాంక్‌బండ్‌ను కొబ్బరినీళ్లతో నింపుతామన్నారుగా.. ఏమైంది కేసీఆర్..?: కిషన్ రెడ్డి

Kishan Reddy Visits Amberpet: మరో రెండురోజుల పాటు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్‌లో పర్యటించారు. పాదయాత్రగా బయలుదేరి వివిధ కాలనీల మీదుగా ప్రేమ్ నగర్, ముసారం బాగ్ బ్రిడ్జ్ వరకు వెళ్లారు. అధికారులను వెంటపెట్టుకొని ప్రజలు తనదృష్టికి తెచ్చిన వివిధ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చిన్నపాటి వర్షానికి నగర ప్రజలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. 

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని ఇస్తాంబుల్, న్యూయార్క్ చేస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి మార్పు లేదనే విషయాన్ని గమనించాలని అన్నారు. ట్యాంక్‌బండ్ ఖాళీ చేసి కొబ్బరినీళ్లతో నింపుతామని మాట్లాడారని.. ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. నేడు నగరంలో పూర్తిగా డ్రైన్స్ సమస్య, మంచి నీటి సమస్య, రోడ్ల సమస్య , పార్కుల సమస్య, వీధి దీపాల మరమ్మతులు పూర్తిచేయలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కూడా ఇవ్వలేని దుస్థితి ఉందని అన్నారు. 

హైటిక్​ సిటీ, మధాపూర్​, ఫైనాన్షియల్​ డిస్ట్రిక్ట్​లోనే ఫ్లైఓవర్లు కడుతూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. నిజమైన హైదరాబాద్​ బస్తీలను నిర్లక్ష్యం చేస్తోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
 
"జీహెచ్‌ఎంసీ వాటర్ వర్క్స్ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. డ్రైన్‌ల పూడిక తీసే చిన్న చిన్న కాంట్రాక్టర్లకు జీహెచ్​ఎంసీ సకాలంలో బిల్లులు చెల్లించకపనులు ఆగిపోయాయి. హైదరాబాద్​ మెట్రో వాటర్​ బోర్డు కూడా నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్ర ఆదాయంలో 80 శాతం హైదరాబాద్ నగరం నుంచే వచ్చినా.. 8 శాతం కూడా ఖర్చు చేయడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎలక్షన్‌లో అనేక హామీలు ఇచ్చారు. ఫ్రీ డ్రింకింగ్ వాటర్, వివిధ టాక్స్‌లను రద్దు చేస్తామని కానీ అవి అమలు కాలేదు. కేసీఆర్ మీరు అధికారంలో ఉండే మూడు నెలలైనా నగరాన్ని అభివృద్ధి చేయండి.." అని కిషన్ రెడ్డి అన్నారు. 

Also Read: BRO Twitter Review: బ్రో ట్విట్టర్ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే.. పవన్ స్టామినాకు తగ్గట్లే..!  

Also Read: Pune Woman Rape Case: అప్పు చెల్లించలేదని దారుణం.. భర్త ఎదురుగానే భార్యపై అఘాయిత్యం   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News