AP Cabinet Expansion: ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్న సమయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచనల నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోసారి మంత్రి మండలిని విస్తరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై నివేదిక తెప్పించుకున్న జగన్.. ఈ మేరకు కేబినెట్‌లో మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికేందుకు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మంత్రిమండలి విస్తరణ ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం జగన్ తన తొలి కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ ముఖ్యమంత్రులతో కలిపి మొత్తం 25 మందికి చోటు కల్పించారు. అయితే రెండున్నళ్ల తరువాత మంత్రిమండలిలో మార్పులు ఉంటాయని ముందే ప్రకటించారు. చెప్పినట్లే గతేడాది కేబినెట్‌లో మార్పులు చేశారు. పాత వారికిలో 11 మందికి చోటు కల్పించి.. కొత్తగా 14 మందికి మంత్రి మండలిలో చోటు కల్పించారు. మంత్రి పదవి కోల్పోయిన వారికి ఆయా జిల్లాల పార్టీ బాధ్యతలు అప్పగించారు. పక్కాగా సామాజికి సమీకరణాలు అమలు చేస్తూ.. అన్ని వర్గాలకు సమన్యాయం ఉండేలా కేబినెట్ రూప కల్పన చేశారు. పాతవారిలో పలువురికి శాఖలు మార్చారు.  


వచ్చే ఎన్నికల్లో 175 సీట్లను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ప్రవేశపెట్టి.. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా..? గ్రౌండ్ లెవెల్‌లో ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. సరిగా పనిచేయని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని ముందే హెచ్చరిస్తున్నారు. 


మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్ తెప్పించుకున్న సీఎం జగన్.. చర్యలు తీసుకునేందుకు రెడీ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందు మంత్రిమండలి నుంచి ఐదుగురిని తప్పించాలని చూస్తున్నట్లు సమాచారం. సామాజిక సమీకణాలు బ్యాలెన్స్ చేస్తూ.. ఐదుగురిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి.. ఆశావహులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. కొత్తగా ఎమ్మెల్సీగా ఎన్నికైన వారిలో కూడా మంత్రులుగా అవకాశం కల్పించే యోచనలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేబినెట్‌ నుంచి ఔట్ అయ్యే ఆ ఐదుగురు ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. 


Also Read: Geetha Singh: రోడ్డు ప్రమాదంలో హాస్యనటి గీతాసింగ్ కుమారుడు మృతి  


Also Read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook