CM Jagan Review On Higher Education Department: డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి సూచించారు. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలని చెప్పారు. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి.. వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ ఉండాలని.. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలని చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యే నాటికి స్వయం ఉపాధి అందుతుంది. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలి. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలి. వచ్చే జూన్‌ కల్లా పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి.


ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌కల్లా నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం.. ఈ నేపధ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలి. ఆ మేరకు మరింత చురుగ్గా పనిచేయాలి.


కళాశాలల్లో కోర్సులన్నీ ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్‌ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి. కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌లాంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుంది. ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలి..' అని సీఎం జగన్ సూచించారు.  


కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని.. మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చించారు. బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని.. అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలన్న సీఎం జగన్ సూచించారు. 


బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్‌ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పారు ముఖ్యమంత్రి. యూనివర్శిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్నారు. ట్రిపుల్‌ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.


Also Read: Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి  


Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook