Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి

Road accidents on Mumbai Goa Highway: మహారాష్ట్రలో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం నాసిక్-షిర్డీ హైవేపై జరిగిన ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. తాజాగా ముంబై-గోవా హైవేపై జరిగిన రెండు ప్రమాదాల్లో 24 మంది క్షతగాత్రులయ్యారు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2023, 02:09 PM IST
  • ముంబై-గోవా హైవేపై రెండు రోడ్డు ప్రమాదాలు
  • 13 మంది మృతి.. 24 మందికి గాయాలు
  • భయాందోళనకు గురి చేస్తున్న వరుస ప్రమాదాలు
Maharashtra Road Accident: మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు.. 13 మంది మృతి

Road accidents on Mumbai Goa Highway: మహారాష్ట్రలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనల్లో 24 మంది గాయపడ్డారు. ముంబై-గోవా హైవేపై వ్యాన్, ట్రక్కు ఢీకొనడంతో 9 మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని ముంబై-గోవా హైవేపై రాయ్‌గఢ్‌లోని మాంగావ్‌ వద్ద గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. అతివేగమే ప్రమాదానికి కారణమైనట్లు తెలుస్తోంది.

ముంబైకి 130 కిలోమీటర్ల దూరంలోని రాయ్‌గఢ్‌లోని రెపోలి గ్రామంలో ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుల బంధువులంతా వ్యాన్‌లో రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళ్తున్నారని ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. ట్రక్కు ముంబై వైపు వెళ్తోంది. మృతుల్లో ఒక బాలిక, ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారని చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.

మరో ప్రమాదంలో నలుగురు..

అదే హైవేపై జరిగిన మరో ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. 23 మంది గాయపడినట్లు సమాచారం. ముంబై-గోవా హైవేపై కంకావ్లీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

గత వారం శుక్రవారం మహారాష్ట్రలోని నాసిక్-షిర్డీ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. షిర్డీ సాయిబాబాను దర్శించుకునేందుకు భక్తులు బస్సులో వెళ్తుండగా.. ఎదురుగా ట్రక్కు వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై సీఎం ఏక్‌నాథ్ షిండే విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు. ప్రమాదంపై విచారణకు కూడా ఆదేశించారు. తాజాగా మరో రెండు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదం నింపుతోంది.

Also Read: Hardik Pandya: థర్డ్ అంపైర్ కళ్లు మూసుకున్నారా..? పాండ్యా ఔట్‌పై వివాదం.. ఇషాన్ కిషన్ రివేంజ్  

Also Read: Go First Flight: బంపర్ ఆఫర్.. దేశంలో ఎక్కడికైనా విమానంలో ఫ్రీ జర్నీ.. వారికి మాత్రమే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News