YSR Law Nestham Funds Releasing Today: `వైఎస్సార్ లా నేస్తం` నిధులు విడుదల.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ!
CM Jagan to Deposite YSR Law Nestham Funds Today : ఆంధ్రప్రదేశ్‌లో యువ న్యాయవాదుల ఖాతాలో నేడు రూ.25 వేలు జమకానుంది. ఐదు నెలల స్టైఫండ్‌ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది..? ఎవరు అనర్హులు..? వివరాలు ఇలా..
CM Jagan to Deposite YSR Law Nestham Funds Release Toaday: జగన్ సర్కారు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. వైఎస్సార్ లా నేస్తం నిధులు నేడు విడుదల చేయనుంది. 2023–24 సంవత్సరానికి మొదటివిడత కింద అర్హులైన 2,677 మంది యువ న్యాయవాదుల అకౌంట్‌లో నెల రూ.5 వేల చొప్పున జమ చేయనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలలకు ఒక్కొక్కరి ఖాతాలోకి మొత్తం రూ.25 వేలను వేయనుంది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా బటన్ నొక్కి వైఎస్సార్ లా నేస్తం పథకం కింద మొత్తం 6,12,65,000 రూపాయలను యువ న్యాయవాదుల అకౌంట్‌లోకి జమ చేయనున్నారు.
యువ న్యాయవాదులకు ఆర్థిక ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఈ పథకం కింద నెలకు రూ.5 వేల స్టైఫండ్ అందిస్తోంది. లా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన యువ న్యాయవాదులు.. లాయర్‌గా స్థిరపడేందుకు మూడేళ్ల వరకు నెలకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ఏడాదికి రెండు వాయిదాల చొప్పున మూడేళ్లపాటు మొత్తం రూ.1.80 లక్షల స్టైఫండ్ అందిస్తోంది. అంటే ఏడాదికి రూ.60 వేల ఆర్థిక సాయం యువ న్యాయవాదులకు అందుతోంది. నేడు రిలీజ్ చేయనున్న ఆర్థిక సాయంతో కలిపి.. 5,781 మంది యువ న్యాయవాదులకు ఇప్పటివరకు 41.52 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని అధికారులు చెబుతున్నారు.
Also Read: Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్
అర్హతలు ఇవే..
==> దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
==> న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
==> 2016 లేదా ఆ తర్వాత లా గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు
==> న్యాయవాదుల చట్టం 1961లోని సెక్షన్ 17 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ నిర్వహించే న్యాయవాదుల రోల్స్‌లో దరఖాస్తుదారు పేరు నమోదు అవుతుంది
==> ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నాటికి ప్రాక్టీస్ ప్రారంభించి.. మొదటి మూడేళ్లు ప్రాక్టీస్‌ను దాటని జూనియర్ న్యాయవాదులకు మిగిలిన కాలానికి స్టైఫండ్ అందుతుంది.
==> ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నాటికి జూనియర్ న్యాయవాది వయసు 35 ఏళ్లకు మించకూడదు.
వీళ్లు అర్హులు కాదు..
==> కుటుంబంలో ఒకరికే ఈ పథకం వర్తిస్తుంది. భార్యాభర్తలు ఉంటే.. ఒకరే అర్హులు అవుతారు.
==> మూడేళ్ల ప్రాక్టీస్ దాటిన జూనియర్ న్యాయవాదులు అర్హులు కాదు
==> నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్న దరఖాస్తుదారు అర్హులు కాదు
==> ప్రాక్టీస్ చేయని న్యాయవాదులు అర్హులు కాదు.
Also Read: CM KCR: సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి