YSR Kalyanamasthu and YSR Shaadi Tohfa: జగన్ సర్కారు మరో తీపికబురు అందించింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద ఆర్థిక సాయం మరో విడుత లబ్ధిదారులకు అందజేయనుంది. బుధవారం ఈ పథకాల నిధులను సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు. ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకుని అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువు తల్లుల ఖాతాల్లో జమ కానున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి.. వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు" ద్వారా.. ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ పథకానికి అర్హుల కావాలంటే వధూవరులిద్దరూ పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిబంధనను పెట్టింది. 


దీంతో పాటు పెళ్లి నాటికి అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలు దాటి ఉండాలనే రూల్‌ను పెట్టింది. దీంతో బాల్య వివాహాల నివారణతో పాటు వారు ఇంటర్ వరకు చదివేందుకు అమ్మ ఒడి సాయం, ఆపై చదువులకు జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, భోజన, వసతి ఖర్చులకు సైతం జగనన్న వసతి దీవెన ద్వారా లబ్ధి ఉండడంతో వారు ఉన్నత విద్యావంతులు, గ్రాడ్యుయేట్లు అవుతారనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి గడిచిన 9 నెలల్లోనే వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద 35,551 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.267.20 కోట్లు జమ చేసింది జగన్ సర్కారు. 


దూదేకుల, నూర్ బాషాల విజ్ఞప్తిని మన్నించి వారికి కూడా వైఎస్సార్ షాదీ తోఫాతో సమానంగా లబ్ధి రూ. 1,00,000 కు పెంచిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కళ్యాణము, వైఎస్సార్ షాదీ తోఫాలకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం 'జగనన్నకు చెబుదాం' 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. పూర్తి వివరాలు నవశకం బెనిఫిషియరీ మేనేజ్ మెంట్ పోర్టల్ https//gsws-nbm.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.


Also Read: US Cyclone: అమెరికాను వణికిస్తున్న భారీ తుపాను, అంధకారంలో ఉత్తర అమెరికా రాష్ట్రాలు


Also Read: Minister Harish Rao: ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఈ నెల 16 నుంచి రూ.లక్ష పంపిణీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి