YSR Rythu Bharosa Payment Status Online: జగన్ సర్కారు రైతులకు తీపి కబురు అందించింది. వైఎస్సార్‌ రైతు భరోసా –పీఎం కిసాన్‌ నిధులు రేపు లబ్ధిదారుల ఖాతాలో జమకానున్నాయి. గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. మంగళవారం నాలుగో ఏడాది మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1090.76 కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. అంతేకాకుండా ఇటీవల పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ చేయనుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు  కూడా వైఎస్సార్‌ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ.13,500 అందిస్తున్న విషయం తెలిసిందే. అన్నదాతలు ఒక్కొక్కరికి ఏటా రూ. 13,500 చొప్పున వరుసగా 3 ఏళ్లు అందజేసింది. నాలుగో ఏడాది ఇప్పటికే రెండు విడతల్లో ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున జమ చేసింది. మంగళవారం మూడో విడత సాయంగా రూ.2 వేలను అందజేయనుంది. 


మంగళవారం ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బయలుదేరనున్నారు. అక్కడి నుంచి 10.15 గంటలకు తెనాలి చేరుకుంటారు. ఉదయం 10.35 గంటలకు తెనాలి వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు సీఎం జగన్. ఈ సందర్భంగా బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం ముగిసిన తరువాత 12.45 గంటలకు తెనాలి నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు తాడేపల్లిలో నివాసానికి చేరుకుంటారు.


Also Read: NZ Vs ENG: కళ్లు చెదిరే రనౌట్ చేసిన వికెట్ కీపర్.. వీడియో చూశారా..?  


Also Read: Rishabh Pant: పంత్ పురాగమనంపై గంగూలీ షాకింగ్ కామెంట్స్.. జట్టులోకి రీఎంట్రీ ఎప్పుడంటే..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook