CM Jagan Ramadan Wishes: నేడు రంజాన్‌ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్రం, ప్రపంచం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సర్వ మానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి రంజాన్ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. రంజాన్‌ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయిక అని అన్నారు. ఇది దివ్య ఖురాన్‌ అవతరించిన పవిత్ర మాసమని... ఈ మాసంలో ముస్లింల కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ముగింపు వేడుక అని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఐకమత్యం, పేదలకు సాయం, సుహృద్భావం... ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని అన్నారు. మనిషిలోని చెడును, ద్వేషాన్ని రూపుమాపే పండగ రంజాన్ అని పేర్కొన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రంజాన్ పండగ విశిష్ఠత :


ఇస్లాం క్యాలెండర్ ప్రకారం... అందులోని తొమ్మిదో మాసాన్ని రంజాన్‌ పండగగా జరుపుకుంటారు. ఈ పండగను రంజాన్ లేదా రామదాన్ అని కూడా పిలుస్తారు. రంజాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలంతా నెల రోజుల పాట కఠిన ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ ఉపవాస దీక్షలను 'రోజా' అని కూడా పిలుస్తారు. రోజా సమయంలో మంచి నీళ్లు కూడా తాగరు. అత్యంత నిష్టగా ఈ ఉపవాస దీక్షలు చేస్తారు.


సూర్యాస్తమయం తర్వాతే ఉపవాసాన్ని విరమిస్తారు. రాత్రిపూట 'ఇఫ్తార్' విందుతో ఉపవాస దీక్షకు ఆరోజుకు ముగింపు పలుకుతారు. దీన్నె సహర్ అని కూడా అంటారు. ఈ ఉపవాస దీక్షల ముగింపుగా 'ఈద్ ఉల్ ఫితర్‌' వేడుకను జరుపుకుంటారు. పవిత్ర ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే ఆవిష్కరించబడిందని చెబుతారు.


కరోనా కారణంగా గత రెండేళ్లుగా ముస్లిములు ఇంటి వద్దే రంజాన్‌ పండగ జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గడంతో మసీదులు, ఈద్గాల వద్ద సామూహికంగా ఘనంగా పండగ జరుపుకోనున్నారు. 


Also Read: Akshaya Tritiya 2022: నేడు అక్షయ తృతీయ.. బంగారం కొనాలా వద్దా.. లక్ష్మీ దేవిని ఎలా పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి


Also Read: Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.