Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..

Horoscope Today  May 3 2022:  నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పనుల్లో జాప్యం, ఇంటి పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 06:18 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం కొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • పెద్దల ఆశీస్సులతో కొన్ని రాశుల వారికి సత్ఫలితాలు
  • నేటి రాశి ఫలాల్లో ఏయే రాశి వారికి ఎలాంటి ఫలితాలున్నాయంటే
Horoscope Today May 3 2022: రాశి ఫలాలు... ఆ రాశి వారు రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లకపోవడం ఉత్తమం..

Horoscope Today May 3 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి ఇవాళ అంతగా కలిసిరాదు. ప్రతీ క్షణం నిరాశ, నిస్పృహ వెంటాడుతాయి. అది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మరికొన్ని రాశుల వారికి పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. పిల్లల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతారు. ఇవాళ్టి రాశి ఫలాలను ఇక్కడ తెలుసుకోండి... 

మేషరాశి ( Aries)

ఇవాళ మీలోని సృజనాత్మకత బయటకొస్తుంది. సామాజికంగా మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. తద్వారా మీ సేవింగ్స్ పెరుగుతాయి. ప్రేమికులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు దొరుకుతుంది. అకడమిక్ పరంగా విద్యార్థులు శుభవార్త వింటారు. కొన్ని విషయాల్లో లేనిపోని భయాందోళనలు కాస్త అలజడి రేపుతాయి. 

వృషభ రాశి (Taurus)

ఇవాళ మీకు నిరాశజనకంగా ఉంటుంది. రోజంతా మూడీగా ఉంటారు. ఆరోగ్యం కూడా సహకరించదు. విశ్రాంతి లేకుండా పనిచేయడం మానసికంగా, శారీరకంగా మీపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతానికి పెట్టుబడుల ఆలోచనను ఉపసంహరించుకుంటే మంచిది. రియల్ ఎస్టేట్ జోలికి వెళ్లవద్దు. లాంగ్ డ్రైవింగ్ లేదా సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. 

మిథున రాశి (GEMINI)

ఇవాళ మిమ్మల్ని అంతృప్తి వెంటాడుతుంది. రోజంతా మూడీగా, నిరాశలో ఉంటారు. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఫలితంగా మీ రోజు వారీ పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. మరింత నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. అయినప్పటికీ సహనాన్ని కోల్పోవద్దు. అడ్వెంచర్ టూర్స్, లాంగ్ డ్రైవింగ్స్‌కి దూరంగా ఉండటం మంచిది. ప్రేమికులు బ్రేకప్ చెప్పుకునే అవకాశం ఉంది.

కర్కాటక రాశి (Cancer) 

పెద్దల ఆశీస్సులు పొందుతారు. పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి. గతంలో చవిచూసిన నష్టాలు ఇప్పుడు లాభాలుగా మారుతాయి. మీ సేవింగ్స్‌తో బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి మంచి విందు ఆరగిస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యలు నయమవుతాయి.

సింహ రాశి (LEO)

ఉద్యోగ, వ్యాపార రంగంలో ఉన్నవారు తాము చేపట్టిన పనిని ఆస్వాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ దక్కే అవకాశం ఉంటుంది. సాయం కోరే ఓ వ్యక్తికి చేయూత అందిస్తారు. సామాజికంగా మీ పలుకుబడి పెరుగుతుంది. పని భారం మిమ్మల్ని మానసికంగా కాస్త అలసటకు గురిచేస్తుంది. ఫ్యామిలీ గెట్ టు గెదర్‌కు వెళ్లలేకపోతారు. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుటపడుతుంది. 

కన్య రాశి (Virgo)

మీరు చేపట్టిన ప్రాజెక్టులు అకారణంగా నిలిచిపోతాయి. అయితే ఆటోమేటిగ్గా మళ్లీ షురూ అవుతాయి. వృత్తిపరంగా సంతృప్తిని పొందుతారు. ఉద్యోగ రీత్యా షార్ట్ ట్రిప్ ప్లాన్ చేస్తారు. మీ అంతరాత్మ ధృఢ చిత్తం కోసం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మీ పెద్దలు మీకు సరైన మార్గం చూపిస్తారు. లక్ష్యాలను చేరుకోవడంలో ఆ మార్గం మీకు దోహదపడుతుంది.

తులా రాశి (Libra)

ఇవాళ మీకు అంతగా కలిసిరాదు. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాల్సిందిగా సూచన. కీలక ఒప్పందాల్లో డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. ఒకసారి మీ చేతుల్లో నుంచి డబ్బు వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్లాక... తిరిగి రికవరీ చేసుకోవడం కష్టమవుతుంది. అడ్వెంచర్ టూర్ మానుకుంటే మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.

వృశ్చిక రాశి (Scorpio)

ఇంట్లో ఆయా పనుల్లో బిజీ బిజీగా గడుపుతారు. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కొనుగోలు చేస్తారు. అవి ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి. మీ క్రియేటివ్ ఆలోచనలు ఎదుటివారు ఇష్టపడుతారు. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. తద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. సింగిల్స్‌కి మ్యారేజ్ విషయంలో శుభవార్త అందుతుంది. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళ చాలా సంతోషంగా గడుపుతారు. ఇన్నాళ్లు ఆందోళన కలిగించిన పెద్దల ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడుతుంది. మీకు రావాల్సిన మనీ రికవరీ అవుతుంది. అది మీ ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి జాబ్ ప్రమోషన్ లేదా కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల రిఫరెన్స్ ద్వారా కొంతమందికి ఉద్యోగం రావొచ్చు.

మకర రాశి (Capricorn) 

మీ జ్ఞానాన్ని, తెలివితేటలను పెంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారు. మేదో విలువ గురించి మీకు మంచి అవగాహన ఉంటుంది. షార్ట్ టెంపర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోగలరు. తద్వారా ఏ టాస్క్ అయినా సాఫీగా పూర్తి చేయగలరు. పెట్టుబడుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు ప్రేమించే వ్యక్తి కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు. వారితో కలిసి సరదాగా గడుపుతారు.

కుంభ రాశి (Aquarius)

ఇవాళ మీకు నిరాశజనకంగా గడుస్తుంది. ఏ పనిని ఆస్వాదించలేరు. మీకు అప్పగించిన పనులను పూర్తి చేసేందుకు తొందరపడుతారు. ఆ క్రమంలో కొన్ని తప్పులు దొర్లుతాయి. మీ పని సామర్థ్యం తగ్గుతుంది. ముఖ్య నిర్ణయాల్లో మీ సన్నిహితుల సలహాలు, సూచనలు స్వీకరించండి. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావని గుర్తుంచుకోండి. 

మీన రాశి (Pisces) 

ఇవాళ మీరు చాలా ఎనర్జిటిక్‌గా, ఉత్సాహవంతంగా ఉంటారు. చేపట్టిన పనిపై మరింత ఫోకస్ చేస్తారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడంలో మీ కొలిగ్స్ సహకారం ఉంటుంది. ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి గుడ్ న్యూస్ అందుతుంది. చాలా కాలం తర్వాత దూరపు బంధువులు మీ ఇంటికొస్తారు. 

Also Read: SARKAARU VAARI PAATA : సీఎం జగన్‌ డైలాగ్‌తో క్రేజ్ పెంచిన మహేష్‌

Also Read: KCR Ramadan Wishes: తెలంగాణ ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News