గోదావరి వరద ( Godavari flood ) పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వరద పరిస్థితులపై అధికార్లతో మాట్లాడారు. పరిస్థితుల్ని సమీక్షించారు. ముఖ్యంగా గోదావరి వరద ( Godavari flood ) స్థితిని అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల్నించి ఇప్పటికే చాలామందిని తరలించారని..వరదను దృష్టిలో పెట్టుకుని మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టుగా సీఎం ( Cm )కు వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఇప్పటికే ఈ దిశగా ఆదేశాలందాయి. ముంపుకు గురయ్యే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని..ఎలాంటి ప్రాణనష్టం లేకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్ కోరారు. 


రక్షణ, పునరావాస చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాల్ని సిద్ధంగా ఉంచుకోవాలని సీఎం సూచించారు. గోదావరి వరద ఉధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదిక అందించాలన్నారు. అటు కృష్ణా జిల్లాలో కూడా భారీ వర్షాల ( Heavy rains ) కారణంగా ఎదురైన పరిస్థితులపై సీఎం జగన్ ఆరా తీశారు. అధికార్లు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరారు. Also read: Godavari Floods: రెండో ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తున్నగోదావరి