CM YS Jagan, Ali Meet: తెలుగు సినీ నటుడు, కమెడియన్ ఆలీ త్వరలో రాజ్యసభలో ఎంపీగా కూర్చొనున్నారని టాక్. వైఎస్సార్సీపీ లీడర్ అయిన ఆలీకి.. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి గుడ్‌ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఆలీకి రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంతేకాదు ఆలీతో వారం రోజుల్లో కలుద్దామంటూ సీఎం జగన్‌ అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తెలుగు సినీ ప్రముఖులు చిరంజీవి, మహేశ్‌ బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, నారాయణ మూర్తిలతో పాటు ఆలీ.. సీఎం జగన్‌ను కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ఈ భేటీ జరిగింది. సీఎం జగన్‌తో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి వారంతా సినిమా ఇండస్ట్రీ సమస్యలు చెప్పారు.


అయితే సినీ ప్రముఖుల కీలక భేటీకి సంబంధించి ఆలీకి ఆహ్వానం రావడం కూడా చర్చనీయాంశమైంది. ఇక గత శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుఫున గట్టిగా ప్రచారం చేశారు ఆలీ. పార్టీకి ఆయనకు చేసిన సేవలకు గుర్తింపుగా సీఎం వైఎస్ జగన్ కీలక పదవి ఇవ్వానుకుంటున్నారట. దీంతో ఆలీకి కచ్చితంగా రాజ్యసభ సీటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం జగన్... ఆలీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని వార్తలు వస్తున్నాయి.


ఇక త్వరలో ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. ఈ క్రమంలో ఈ నాలుగు స్థానాల్లో ఒక స్థానాన్ని సీఎం వైఎస్ జగన్ మైనార్టీలకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆ మైనార్టీ స్థానం నటుడు ఆలీని వరించనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 


ఇక సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో వైఎస్సార్సీపీ లీడర్ ఆలీతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. వారిద్దరి పలు విషయాలపై చర్చ సాగింది. వారం రోజుల్లో మళ్లీ కలుద్దామని ఆలీకి సీఎంకు చెప్పారు. దీంతో రాజ్యసభ సీటు విషయం గురించి మాట్లాడేందుకే ఆలీని.. సీఎం మళ్లీ కలుద్దామంటున్నారంటూ చర్చ సాగుతోంది.


Also Read: Monkey Fever in Kerala: కరోనా తగ్గుముఖం పట్టేలోపు దేశంలో మరో వైరల్ ఫీవర్ కలవరం!


Also Read: Bulb Changing Job: బల్బు మార్చడమే అతడి పని.. నెలకు రూ.40 వేల జీతం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook