నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే
త్వరలో ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ నేడు భేటీ కానుంది. పలు కీలక అంశాలు, బిల్లులకు ఆమోదం తెలపనుంది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan Reddy) అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం (AP Cabinet Meeting) కానుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న రాష్ట్ర కేబినెట్ బేటీలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం (Social Distancing) పాటించనున్నారు. త్వరలో జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు పలు బిల్లులపై సైతం చర్చించనున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటున్నారా.. ఇది తెలుసుకోండి
అక్రమ మద్యం, ఇసుక రవాణా నిరోధించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు నేడు కేబినెట్ ఆమోదం తెలపనుంది. జీఎస్‌టీ (GST) ఎగవేతను నివారించడం, ఇందుకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్ధిక సాయం అందించే వైఎస్సార్ చేయూత పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. తెలుగు భాషకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. భార్యకు కరోనా పాజిటివ్.. భయంతో భర్త మృతి
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, వైద్య సిబ్బంది ఖాళీల భర్తీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలన్నదానిపై చర్చిస్తారు. పోలీసు శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరుకు ఆమోదం లభించనుంది. గండికోట నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ ముసాయిదా బిల్లును రాష్ట్ర కేబినెట్ ఆమోదించనుంది. రాష్ట్రంలో మూడు నర్సింగ్ కాలేజీల ఏర్పాటు, విజయనగరం జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్